Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీట్ల పంపకాలు ముగిసిన వేళ.. తేల్చేసిన ప్రశాంత్ కిశోర్

Prashant Kishore: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. మార్చి రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య పొత్తుల వ్యవహారాలు ఒక్కటొక్కటిగా తేలుతున్నాయి.

ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

BJP cant win 370 seats on its own, says Prashant Kishor

ఈ క్రమంలో కాంగ్రెస్‌‌తో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తయింది. తొలిదశలో చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం సహా మొత్తంగా అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్- ఆప్ సీట్లను పంచుకున్నాయి. దీని వివరాలను కాంగ్రెస్- ఆప్ నేతలు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు.

ఈ పరిణామాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనాలంటే ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా బ్లాక్‌.. ధీటుగా వ్యూహాలను రూపొందించుకోవాల్సి ఉంటుందని అన్నారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 100 సీట్లను గెలుచుకుంటే అది గొప్పేనని వ్యాఖ్యానించారు. వంద సీట్లల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేరని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌కు ఇప్పుడున్న స్థానాల కంటే ఎక్కువగా దక్కుతాయని తాను అనుకోవట్లేదని అన్నారు. దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఓటుబ్యాంకు పెరిగినట్లు కనిపించట్లేదని పేర్కొన్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ భావిస్తోన్నప్పటికీ.. అది సాధ్యం కాదని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. బీజేపీ సొంతంగా ఈ మార్క్‌ను అందుకోలేదని అంచనా వేశారు. 370 నియోజకవర్గాలను గెలవాల్సి ఉంటుందని బీజేపీ.. తన కార్యకర్తలకు ఆదేశించినప్పటికీ.. ఆ స్థాయిలో ఓట్లు పడకపోవచ్చని అన్నారు. ఒకవేళ- బీజేపీ ఈ మార్క్‌ను అందుకుంటే అది అద్భుతమే అవుతుందని చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తన లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచుకోగలుగుతుందని ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీకి 18 సీట్లు రాగా.. ఈ దఫా ఈ సంఖ్య పెరుగుతుందని అన్నారు. సందేశ్‌ఖాలీ ఘటన తరువాత తృణమూల్ కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని అభిప్రాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+