బీజేపీ చీటింగ్: రాహుల్, పడబోయిన మహిళని పట్టుకున్న యువనేత
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుపై ఆర్డినెన్స్ తేవడం ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులను చీటింగ్ చేస్తోందని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదివారం అన్నారు. రాహుల్ నేతృత్వంలో కిసాన్ ర్యాలీ ఆదివారం ఉదయం రాంలీలా మైదాన్‌లో ప్రారంభమైంది. ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ చట్టంలోని మార్పులకు వ్యతిరేకంగా ఈ ర్యాలీ చేపట్టారు.
ఈ ర్యాలీలో పాల్గొనేందుకు దేశం నలుమూల నుంచి వేలాదిగా రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి వచ్చారు. భూసేకరణ ఆర్దినెన్స్, భూసేకరణ సవరణల బిల్లు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని రాహుల్ చెప్పారు. రాంలీలా మైదాన్ వేదికగా రైతులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. కేంద్రం రైతులు, కూలీలను మర్చిపోయిందన్నారు. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు.

కేంద్రం రైతులకు వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. భూసేకరణ చట్ట సవరణ బిల్లుతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోందన్నారు. ఆహార భద్రత చట్టం సహా సామాన్యులకు తాము ఎంతో చేశామన్నారు. రైతులకు భారం తగ్గించేందుకు రూ.70వేల కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. రైతులకు ఎప్పుడు కష్టం వచ్చినా తాము ఆదుకుంటామన్నారు.
Farmers throng at Ramlila ground, Delhi for ' 'Maha Kisan rally'. pic.twitter.com/PW6Vf6t0YS
— ANI (@ANI_news) April 19, 2015 రైతుల శ్రేయస్సు కోసమే గోదుముల మద్దతు ధర పెంచామన్నారు. దేశంలో రైతులు, కూలీలు భయపడుతున్నారన్నారు. రైతులకు నష్టం చేకూరని భూసేకరణ చట్టాన్ని తెచ్చామని, తాము తెచ్చిన బిల్లుకు సవరణ చేయాలని చూస్తున్నారన్నారు. రైతులలకు నష్టం కలగని భూసేకరణ బిల్లు తెచ్చేందుకు రెండేళ్ల సమయం పట్టిందన్నారు. 50 ఏళ్లుగా దేశంలో పోగైన చెత్తను శుభ్రం చేస్తానని ప్రధాని చెప్పడం విచారకరమన్నారు.
Delhi: Preparations underway ahead of Congress’ Mega Farmer Rally pic.twitter.com/nv759mScGf
— ANI (@ANI_news) April 19, 2015 Delhi: Security tightened ahead of Congress’ Mega Farmer Rally pic.twitter.com/Br2SMEv0No
— ANI (@ANI_news) April 19, 2015 అంతకు ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడారు. రైతులు ప్రధాని మోడీ మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు. రైతు సమస్యలు మోడీ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం తీరు గాయం పైన కారం చల్లినట్లుగా ఉందన్నారు.
మహిళకు రాహుల్ గాంధీ
March of the youth brigade.. INC supporters march towards the rally venue #KisaanVirodhiNarendraModi pic.twitter.com/HxPak9BUDf
— INC India (@INCIndia) April 19, 2015 రాంలీలా మైదాన్‌లో జరుగుతున్న కిసాన్ ర్యాలీ వేదిక పైన ఓ మహిళ తూలి పడిపోబోగా.. రాహుల్ గాంధీ పట్టుకున్నారు. రాహుల్ గాంధీ సహా పలువురిని నేతలు సత్కరించేందుకు వేదిక పైకి వచ్చారు. ఆ సమయంలో ఓ మహిళా నాయకురాలు పడబోయారు. వెంటనే స్పందించిన రాహుల్.. ఆమెను పట్టుకొని నిలబెట్టారు.
Party workers marching in for the Kisaan-Khet Majdoor rally, New Delhi, April 19 #KisaanVirodhiNarendraModi pic.twitter.com/DCzoEPiLBr
— INC India (@INCIndia) April 19, 2015 











Click it and Unblock the Notifications