వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభలో అడుగుపెట్టనున్న అమిత్ షా, స్మృతి ఇరానీ రెండోసారి

బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. ఆగస్టు 8న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. ఆగస్టు 8న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు.

ఈ మేరకు బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బుధవారం నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అనంతరం, కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపి నడ్డా మీడియాతో మాట్లాడారు.

BJP Chief Amit Shah To Contest August 8 Rajya Sabha Polls From Gujarat

రాజ్యసభ ఎన్నికల్లో అమిత్ షా పోటీ చేయనున్నారని, ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న స్మృతీ ఇరానీ రెండోసారి కూడా ఈ రాష్ట్రం నుంచే రాజ్యసభకు పోటీ చేస్తారని చెప్పారు.

గుజరాత్ నుంచి రాజ్యసభకు మూడు స్థానాలకు వచ్చే నెల 8న ఎన్నికలు జరగనున్నాయి. రెండు స్థానాల్లో అమిత్ షా, స్మృతి ఇరానీ పేర్లు ప్రకటించిన బిజెపి పార్లమెంటరీ బోర్డు, మూడో స్థానానికి ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. అమిత్ షా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.

English summary
BJP chief Amit Shah will contest Rajya Sabha elections from Gujarat, the party said today. Elections will be held for three seats in the state on August 8 and the BJP has the numbers to easily win two.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X