శూన్యం నుంచి శిఖరానికి! భయాన్ని జయించారు: ఈశాన్య ఫలితాలపై మోడీ ఆనందోత్సాహం
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనూహ్యమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడిన విషయం తెలిసిందే.
త్రిపురలో బీజేపీ ఘన విజయం దాదాపు ఖరారైపోయింది. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేశారు.
ప్రజల విశ్వాసం
ఎన్నికల ఫలితాలపై తన ఆనందాన్ని వరుస ట్వీట్లలో వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ఎన్నికలు మారుతున్నా.. ఎలాంటి సమయంలోనైనా ఎన్డీయే ప్రభుత్వం, తమ అభివృద్ధి అజెండాలపై ప్రజలు విశ్వాసం చూపిస్తున్నారని మోడీ అన్నారు. మోసపూరిత, ప్రతికూల రాజకీయాలను ప్రజలు ఎన్నటికీ గౌరవించరని ఆయన చెప్పారు.
మీకో అహర్నిశలు
‘త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో ప్రజలు తమ తీర్పును ఇచ్చారు. బీజేపీ అభివృద్ధి అజెండాలో ఒకటైన ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ'కి, మా కూటమి పార్టీలకు మద్దతిచ్చినందుకు ఈ రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడి ప్రజల కోరికలు, ఆశయాలను నెరవేర్చేందుకు అహర్నిశలు పాటుపడుతాం' అని మోడీ తెలిపారు.
మాటలు సరిపోవు..
అంతేగాక, ‘2018 త్రిపుర ఎన్నికలు నవశకానికి నాంది పలికాయి. త్రిపుర సోదర, సోదరీమణులు అద్భుతం చేశారు. వారికి కృతజ్ఞతలు చెప్పేందుకు మాటలు సరిపోవడం లేదు. త్రిపురలో మార్పు తీసుకొచ్చేందుకు మేం ఏ మార్గాన్ని వదిలిపెట్టబోం' అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
శూన్యం నుంచి శిఖరానికి..
‘త్రిపురలో విజయం సాధారణ ఎన్నికల విజయం కాదు. శూన్యం నుంచి శిఖరానికి చేరుకున్నాం. ఇందుకు అభివృద్ధి అజెండాలు ఎంతగానో దోహదం చేశాయి. దీన్ని సుసాధ్యం చేసేందుకు ఏళ్ల తరబడి శ్రమిస్తున్న ప్రతి బీజేపీ కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ రోజు శాంతి, అహింస కలిసి భయాన్ని ఓడించాయి. త్రిపుర ప్రజలకు సరైన పాలన అందిస్తాం. మేఘాలయ, నాగాలాండ్‌లలోనూ బీజేపీకి మద్దతిచ్చినందుకు సంతోషంగా ఉంది. వారందరికీ కృతజ్ఞతలు' అని మోడీ తెలిపారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications