వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్కంఠగా మహారాష్ట్ర రాజకీయాలు.. మరోసారి బీజేపీ కోర్ కమిటీ భేటీ

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. బీజేపీ-శివసేన మధ్య సీఎం సీటు మధ్య మాటలయుద్ధానికి దారితీయడంతో.. తెరపైకి కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్‌ను ఎన్సీపీ కోరింది. దీంతో బీజేపీ ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. ఇప్పటికే కోర్ కమిటీలో చర్చించిన బీజేపీ.. సాయంత్రం మరోసారి సమావేశమవ్యాలని నిర్ణయించింది.

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్-ఎన్సీపీని కోరాలని కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా కోరడంతో బీజేపీ కోర్ కమిటీ మరోసారి సమావేశమవుతోంది. ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ మీడియాకు తెలిపారు. బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడకపోవడంతో.. రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్-ఎన్సీపీని పిలువాలని మిలింద్ కోరిన సంగతి తెలిసిందే.

BJP core group to meet again, decide on Governor’s invitation

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ జర్మనీ నియంత హిట్లర్‌ను తలపిస్తున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. సీఎం పోస్టు కోసం సంకీర్ణ ప్రభుత్వం విచ్చిన్నం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన రాజీ కాక.. బెదిరిస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు శివసేన ఎమ్మెల్యేలు చీఫ్ ఉద్దవ్‌తో సమావేశమయ్యారు. మాలాద్ రిసార్ట్‌లో సమావేశమై.. ప్రస్తుత పరిస్థితిని చర్చిస్తున్నారు. సోమవారం బీజేపీ బలపరీక్ష నిరూపించుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ ఆహ్వానించిన అంశాన్ని కూడా చర్చించారు. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి 15రోజులవుతున్నా.. ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.

English summary
bjp MLA Sudhir Mungatiwar said the party will meet again to take a decision on the Governor’s invitation to form the maharashtra government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X