"రాత్రి బయటకు రావొద్దన్నారు".. ఇండియా వరల్డ్ కప్ గెలుపుతో మమతా బెనర్జీకి కౌంటర్స్..!

భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుని చారిత్రక విజయం సాధించింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీని పట్ల యావత్ భారత్ మొత్తం హర్షం వ్యక్త చేస్తోంది. అయితే ఈ సంతోషకరమైన సందర్భం అనూహ్యంగా రాజకీయ వివాదానికి తెరలేపింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ట్వీట్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. మమత గతంలో మహిళలు రాత్రిపూట బయటికి రావడంపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మమతా బెనర్జీ ట్వీట్..

కాగా టీం ఇండియా జట్టును అభినందిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఆ పోస్టులో.. ప్రపంచకప్ ఫైనల్‌లో మన అమ్మాయిలు సాధించిన విజయానికి దేశమంతా గర్విస్తోందని ప్రశంసలు కురిపించారు. టోర్నమెంట్ ఆసాంతం వారు చూపిన పోరాటపటిమ, ప్రదర్శించిన ఆధిపత్యం ఎందరో యువతులకు స్ఫూర్తినిస్తుంది. మీరు ప్రపంచస్థాయి జట్టు అని నిరూపించుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. మేము మీకు అండగా ఉంటాం" అని మమత రాసుకొచ్చారు.

bjp-counter-to-cm-mamatha-benerjee-over-india-women-team-winning-tweet

అయితే మమత ట్వీట్ కి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. గత నెలలో దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జరిగిన అత్యాచార ఘటనపై మమత చేసిన వ్యాఖ్యలను బీజేపీ ప్రస్తావించింది. "అయ్యో! వాళ్లు రాత్రి 12 గంటల వరకు ఆడారు... కానీ మీరు వాళ్లను రాత్రి 8 గంటలకే ఇంటికి వచ్చేయమన్నారుగా?" అని బీజేపీ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.

గత నెలలో మెడికల్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనపై మమతా బెనర్జీ మాట్లాడుతూ "బాధితురాలు రాత్రి 12:30 గంటలకు బయట ఎందుకు ఉంది? ముఖ్యంగా ఆడపిల్లలు రాత్రిపూట బయటకు రాకూడదు. వాళ్లను వాళ్లు కూడా కాపాడుకోవాలి" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. బాధితురాలినే నిందించేలా ఉన్నాయంటూ మమతపై విమర్శలు వెల్లువెత్తాయి.

జాతీయ జట్టు చారిత్రక విజయాన్ని దేశమంతా ఆనందంగా జరుపుకుంటున్న సమయంలో, ఈ రాజకీయ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ రాజకీయ రగడకు దూరంగా, భారత మహిళల జట్టు దశాబ్దాల కలను సాకారం చేసుకున్న ఆనందంలో మునిగితేలుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+