యూపీలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ; రైతుల ఉద్యమ ప్రాంతాల్లోనూ యోగి టీమ్ లీడ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికార బీజేపీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రారంభ ఫలితాలలోనే బీజేపీ దూసుకుపోయింది. బీజేపీ మెజారిటీని కనబరుస్తోంది. 10 గంటల సమయానికి బిజెపి 250కి పైగా సీట్లలో ఆధిక్యంలో ప్రదర్శిస్తోంది.
యూపీలో బీజేపీకి చావు దెబ్బ తగులుతుంది అనుకున్న ప్రాంతాలలో కూడా బిజెపి మెజారిటీ తో దూసుకుపోతుంది. రైతుల ఉద్యమ ప్రభావం భావించిన పశ్చిమ యూపీ ప్రాంతంలోనూ బీజేపీ లీడ్ లో ఉంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలం పాటు రైతుల సాగించిన ఉద్యమంలో పశ్చిమ యూపీ ప్రాంత రైతులు కీలక భూమికను పోషించారు. రైతులను తీవ్ర ఇబ్బంది పెట్టిన బిజెపికి వ్యతిరేకంగా పశ్చిమ ఈ ప్రాంత రైతులు ఎన్నికల తీర్పు ఇస్తారని అంతా భావించినా, అందుకు విరుద్ధంగా పశ్చిమ యూపీ లోనూ బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి.

పశ్చిమ యూపీలో బీజేపీ తన అద్భుతమైన ప్రదర్శన తో దూసుకుపోతోంది పశ్చిమ యూపీని స్వీప్ దిశగా బిజెపికి ఓట్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.కనీసం 114 స్థానాలలో పశ్చిమ యూపీలో బీజేపీ అధికారాన్ని కొనసాగిస్తుంది. మొత్తంగా యూపీలో 403 స్థానాలకు గాను బిజెపి ప్రస్తుతం దాదాపు 250 స్థానాలలో లీడ్ సాధించగా 300 స్థానాలు బిజెపి ఖాతాలో పడతాయని ప్రస్తుతం కొనసాగుతున్న ఫలితాల ట్రెండ్ ను బట్టి బిజెపి నేతలు అంచనా వేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఇప్పటికే బీజేపీ నేతలు సంబరాలు కొనసాగించారు. యూపీలో మొత్తం 403 బిజెపి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా ఉత్తరప్రదేశ్లో పాగా వేయాలని శతవిధాల ప్రయత్నాలు చేసిన సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ లు వెనుకబడ్డాయి. చాలా చోట్ల సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా పోరాటం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ప్రకారం ఇప్పటివరకు బీజేపీకి 52 శాతం, బహుజన్ సమాజ్ పార్టీకి 22.1 శాతం, సమాజ్వాదీ పార్టీకి 16.3 శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతంలో అఖిలేష్ కు చెందిన సమాజ్వాదీ పార్టీ కంటే బహుజన్ సమాజ్ పార్టీ ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా వెనుకబడింది. సమాజ్ వాదీ పార్టీ 100 స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తుంది. ఇక బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు సింగిల్ డిజిట్ లోనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications