వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ వచ్చారు: రెబల్స్ మంది మీద వేటు వేసిన బీజేపీ; స్వతంత్ర అభ్యర్థులు, నష్టం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటి చెయ్యడానికి అవకాశం రాకపోవడంతో పార్టీ మీద తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 15 మంది సీనియర్ నాయకులను పార్టీ నుంచి బహిష్కరిస్తూ బీజేపీ ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో బీజేపీ రెబల్ అభ్యర్థుల మీద కఠిన చర్యలు తీసుకున్నారు.

అన్ని పదవులు పీకేశారు

అన్ని పదవులు పీకేశారు

బీజేపీ అధికారిక అభ్యర్థుల మీద తిరుగుబాటు చేస్తూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 15 మంది నాయకులను పార్టీలోని అన్ని పదవుల నుంచి ఆరు సంవత్సరాలు బహిష్కరించామని బీజేపీ కర్ణాటక రాష్ట శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప ప్రకటించారు.

మీకు అదే గతి

మీకు అదే గతి

బీజేపీ బహిష్కరించిన నాయకులకు పార్టీతో, పార్టీ కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని, పార్టీ కార్యకర్తలు వీరికి సహకరించరాదని బీఎస్. యడ్యూరప్ప ఆదేశాలు జారీ చేశారు. తిరుగుబాటు నేతలకు ఎవరైనా సహకరిస్తే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని బీఎస్. యడ్యూరప్ప హెచ్చరించారు.

అసమ్మతితో తిరుగుబాటు

అసమ్మతితో తిరుగుబాటు

కర్ణాటకలోని జమఖండి, హనుగుంద, గుబ్బి, హోళల్కెరె, శిగ్లాంవ్, సండూరు, హువిన హడగలి, రాణేబెన్నూరు, మళవళ్ళి, రామదుర్గ, కుమటా, బైలహోంగల, ఖానాపుర, మోళకాల్మూరు శాసన సభ నియోజక వర్గాల్లో టిక్కెట్లు రాలేదని బీజేపీ నాయకులు రెబల్ అభ్యర్థులుగా శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

బీజేపీ బహిష్కరించిన లీడర్స్

బీజేపీ బహిష్కరించిన లీడర్స్

బీజేపీ మీద తిరుగుబాటు చేస్తూ రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సంగమేశ్ నిరాణి, నవలగి హీరేమఠ్, దిలీప్ కుమార్, హనుమక్క, గోపిక్రిష్ణ, సోమణ్ణ బీవినమరద, బంగారి హనుమంత, ఓడూగంగప్ప, వీసీ. పాటిల్, మహదేవ, రమేష్ పెంచెగట్టి, సూరజ్ నాయక్, జగదీష్ మణగుడ్డ, గజానన రెహమాని, తిప్పేస్వామిని పార్టీ నుంచి బహిష్కరించారు.

మాజీ మంత్రి సోదరుడు

మాజీ మంత్రి సోదరుడు

మాజీ మంత్రి మురగేశ్ నిరాణి సోదరుడు సంగమేశ్ నిరాణి జమఖండి నియోజక వర్గం టిక్కెట్ ఇవ్వాలని మనవి చేసినా పార్టీ మాత్రం శ్రీకాంత్ కులకర్ణికి టిక్కెట్ ఇచ్చింది. సంగమేశ్ నిరాణి తిరుగుబాటు చేసి స్వతంత్రపార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

బళ్లారి శ్రీరాములు దెబ్బ

బళ్లారి శ్రీరాములు దెబ్బ

చిత్రదుర్గ జిల్లా మాళకాల్మూరులో బళ్లారి ఎంపీ బి. శ్రీరాములు పోటీ చెయ్యడానికి బీజేపీ అవకాశం ఇచ్చింది. అయితే స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి తిరుగుబాటు చేసి స్వతంత్రపార్టీ అభ్యర్థిగా పోటీ చెయ్యడంతో ఆయన మీద పార్టీ వేటు వేసింది.

English summary
Karnataka Bjp expelled its 15 members from the party's all responsibilities for the next year as they are contesting against party's candidates as independents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X