వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇక ఎన్నికల్లో పోటీ చేయను: కేంద్రమంత్రి ఉమా భారతి కీలక నిర్ణయం
లక్నో: భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్, కేంద్ర మంత్రి ఉమా భారతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను భవిష్యత్‌లో జరగబోయే ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయనని స్పష్టం చేశారు.

అయితే, పార్టీ కోసం నిరంతరం పని చేస్తానని ఉమా భారతి తెలిపారు. వయసు రీత్యా, ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఉమా భారతి వెల్లడించారు.
ఇప్పటికే మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పితో బాధపడుతున్నానని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఉమా భారతి.. మధ్య ప్రదేశ్‌లోని ఝాన్సీ నియోజకవర్గం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలో ఆమె మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!