నాథూరాం గాడ్సే వ్యాఖ్యల దుమారం..., కమలహాసన్‌పై 5 రోజుల నిషేధం విధించాలి ; బీజేపీ

ఇప్పటికే హిందుత్వ తీవ్రవాదం అంటూ ఇదివరకు ఒకసారి కామెంట్ చేసిన నటుడు మక్కల నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.తమిళనాడులోని అరవకుచ్చి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్భర్థి తరపున ప్రచారం చేస్తున్నా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి..దీంతో కమలహాసన్ వ్యాఖ్యలను సీరియస్ తీసుకుంది బీజేపీ.దీంతో ఐదు రోజుల నిషేధం విధించాలని బీజేపీ ఎన్నికల కమీషన్ కు పిర్యాధు చేసింది.

భారత దేశ తొలి తీవ్రవాదీ హిందువే

భారత దేశ తొలి తీవ్రవాదీ హిందువే

ప్రచారంలో భాగంగా కమల హాసన్ మాట్లాడుతూ...స్వతంత్ర్య భారత దేశంలో తోలి ఉగ్రవాది ఎవరైన ఉన్నారంటే అది హిందువే గాంధిని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను ఉద్దేశించి అన్నాడు. ఎందుకంటే గాంధినీ చంపిన నాథూరాం గాడ్సే హిందూ మహాసభ నాయకుడని వ్యాఖ్యానించారు అందుకే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ఉగ్రవాది హిందువేని అన్నారు.

ఇక తాను హిందుతీవ్రవాదం అన్నందుకు చాలమంది విమర్శించారని అయితే ఏ మతమైన హింసను ప్రోత్సహించదని అన్నారు.ఇక ఖురాన్ నమ్మేవారు ఎవరుకూడ ఉగ్రవాదులు కారని స్పష్టం చేశారు. ఇక బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల మధ్య విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు..కమల్ హాసన్ ఇలాంటీ వ్యాఖ్యలు చేయడం రెండవసారి 2017లో కూడ హిందూ తీవ్రవాదం పై మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు.

గాంధికి న్యాయం జరగాలి...

గాంధికి న్యాయం జరగాలి...

కాగా తమిళనాడు రాష్ట్రంలోని అరవకురిచిలో అక్కడి ఎమ్మెల్యే సెంథిల్ బాలజీ డిస్‌క్వాలిఫై కావడంతో ఈనెల 19 ఉపఎన్నిక జరగనుంది.కాగా ఎంఎన్‌ఎం పార్టీ తరుపున మోహన్ రాజ్ అనే అభ్యర్థిని బరిలోకి దింపాడు కాగా ఆ నియోజకవర్గంలో ఎక్కవ శాతం ముస్లిం ఓట్లు ఉన్నాయి .దీంతో ముస్లిం ఓట్ల కోసం తాను ఈ వ్యాఖ్యలు చేయడంలేదని కమలహసన్ స్పష్టం చేశారు. కాగా గాంధి విగ్రహం ముందు నిలబడి మాట్లాడిన కమల్ హాసన్ తాను గాంధీ సిద్దాంతాలకు మనవడినని పేర్కోన్నారు. ఈనేపథ్యంలోనే గాంధికి న్యాయం కావాలని నేను డిమాండ్ చేస్తున్నాని అన్నారు.

కమల్ వ్యాఖ్యలను ఖండించిన తమిళనాడు బీజేపీ

కాగా కమల హాసన్ వ్యాఖ్యలను తమిళనాడు రాష్ట్ర్ర బీజేపీ అధ్యక్షురాలు సౌందరరాజన్ తీవ్రంగా ఖండించారు. ముస్లింల ఓట్ల కోసం కమల హాసన్ ఆగ్నికి అజ్యం పోస్తున్నాడని ఆమే విమర్శించారు. కాగా ఇటివల శ్రీలంకలో జరిగిన బాంబు దాడుల గురించి ఎందుకు స్పందించడం లేదని ఆమే నిలదీశారు. దానిపై ఆయన అభిప్రాయం కూడ చెప్పడం లేదని అన్నారు.మరోవైపు బీజేపీ జనరల్ సెక్రటరీ సైతం ఆయన వ్యాఖ్యలను ఖండించారు. కమలహాన్ గాంధికి మనవడు కాదని ,మహ్మద్ ఆలీ జిన్నాకు వారసుడని దుయ్యబట్టారు.మహ్మద్ ఆలీ జిన్నా 15 ఆగస్టు తర్వాతా వేలాదీ మంది శవాలను ట్రైన్‌లో వేసి పంపిణ ఘటన గుర్తులేదా అంటూ ప్రశ్నించారు.

కమల్ వ్యాఖ్యలు 1000 శాతం నిజం ..తమిళ్ కాంగ్రెస్

కమల్ వ్యాఖ్యలు 1000 శాతం నిజం ..తమిళ్ కాంగ్రెస్

కమల హసన్ చేసిన వ్యాఖ్యలు వెయ్యి శాతం సరైనవే అంటూ తమిళనాడు కాంగ్రేస్ పార్టీ చీఫ్ ఆళగిరి మద్దతు పలికారు. దీంతోపాటు బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఆయన ఐసిస్ తో పోల్చాడు.ఇస్లాం పేరు చెప్పుకుని ఐసిస్ ఎలాగైతే తీవ్రవాద సంస్థగా మారిందో హిందుయిజం పేరు చెప్పుకుని ఆర్ఎస్ఎస్ కూడ తీవ్రవాద సంస్థగా మారిందని ఆయన విమర్శించారు. కాగా హిందు సంస్థలు తమని వ్యతిరేకించేవారిని అంతమొందించాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను ఆయన 100 శాతం కాదు, 1000 శాతం కరెక్టే అని సమర్ధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+