గుజరాత్ లో బీజేపీకి మరో దెబ్బ... కాంగ్రెస్ లోకి అల్పేష్ ఠాకూర్

Posted By:
Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: గుజరాత్ లో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలి కాలంలో గుజరాత్ లో అధికార బీజేపీని ఎదిరించి వార్తల్లో నిలిచిన యువ నేతల్లో ఒకరైన ఇతర వెనుకబడిన వర్గాల ప్రతినిధి అల్పేష్ ఠాకూర్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హార్దిక్ పటేల్, జగ్నేష్ మెవాని వంటి వారితో పాటు ఓబీసీ వర్గాల్లో యువత ప్రతినిధిగా పేరు తెచ్చుకున్న అల్పేష్, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ నిజాయితీపరుడని ప్రశంసించారు. బీజేపీవన్నీ గాలిమాటలేనన్నారు.

BJP Has Only Given Slogans, Rahul Gandhi is Honest: Gujarat OBC Leader Alpesh Thakor After Joining Congress

ఏ పార్టీలో చేరాలన్న విషయమై తాను ప్రజాభిప్రాయాన్ని సేకరించానని, అత్యధికులు కాంగ్రెస్ వెంట నడవాలని చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

రాజకీయాల్లోకి వచ్చి, మార్పు తీసుకురావాలని పలువురు తనను కోరారని, మొత్తం 25 లక్షల మంది అభిప్రాయాన్ని స్వీకరించి తాను కాంగ్రెస్ లో చేరానని అన్నారు. కేవలం లక్షా ఆరు వేల మంది మాత్రమే తనను బీజేపీలో చేరాలని చెప్పారని అన్నారు.

అల్పేష్ కాంగ్రెస్ లో చేరికపై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పందిస్తూ, ఆయన కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వచ్చిందని, అల్పేష్ కాంగ్రెస్ మాజీ నేతేనని, ఆ పార్టీ వాళ్లు, ఆ పార్టీలో చేరినట్టు చెప్పుకోవడం ఎందుకని ఎద్దేవా చేశారు. గతంలో అల్పేష్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని కూడా రవి శంకర్ ప్రసాద్ గుర్తు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A day after joining the Congress, Gujarat OBC leader Alpesh Thakor took on the BJP on Monday and said its only contribution was giving slogans. "The BJP has given several slogans for the SC, ST and OBCs but in reality, no work has taken place on the ground. Irrespective of what the Congress' image is, Rahul Gandhi is honest, his intention is noble. He told me that we would work together and I have not asked for any post in return for my support," said Thakor.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి