మాజీ సీఎంకు బంఫర్ ఆఫర్ ఇచ్చిన మోదీ ? ఆంధ్రా బార్డర్ కు వెళ్లండి బ్రదర్, నో చెప్పిన లీడర్ !
కర్ణాటకలో ఎక్కువ లోక్‌సభ నియోజకవర్గాలు గెలుచుకునేందుకు బీజేపీ హైకమాండ్ అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే కర్ణాటకలో 20 లోక్ సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో బీజేపీలో తిరుగుబాటు మంటలు రాజుకున్నాయి. బెంగళూరు నార్త్ లోక్ సభ నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ బీజేపీ హైకమాండ్ కు తలనొప్పిగా తయారైనారు
బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరాలని సదానంద గౌడకు ఆఫర్ వచ్చిందని కర్ణాటక రాజకీయాల్లో చర్చ మొదలైంది. అలాగే టికెట్లు దక్కని బీజేపీ నేతలందరినీ కాంగ్రెస్ నేతలు సంప్రదించారని తెలిసింది, కర్ణాటక మాజీ సీఎం సదానంద గౌడను కాంగ్రెస్ నేతలు సంప్రదించినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీలోని సీనియర్ నేతలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి చాలా నష్టం వాటిల్లుతుందని బీజేపీ నేతలు సదానంద గౌడను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మాజీ సీఎం సదానంద గౌడకు బీజేపీ హైకమాండ్ ఫోన్‌లో సంప్రదించి చిక్కబళ్లాపూర్ లోక్‌సభ స్థానం టికెట్ ఇస్తామని బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. బీజేపీ శిబిరంలో టికెట్లు రాకపోవడంతో పలువురు సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు కర్ణాటకలోని బీజేపీ సీనియర్ నేతలు ముందుకొచ్చారు. ఒక్కలిగ నేత సదానంద గౌడకు మైసూరు లోక్‌సభ నియోజకవర్గం టిక్కెట్టును కాంగ్రెస్ ఆఫర్ చేసింది.
ఇదే సమయంలో ఢిల్లీ వెళ్లే ముందు మాజీ సీఎం సదానంద గౌడతో ఫోన్‌లో మాట్లాడి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర తమ మీద నమ్మకం పెట్టాలని, మీకు కచ్చితంగా న్యాయం జరుగుతోందని, మమ్మల్ని నమ్మాలని సదానంద గౌడకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారని తెలిసింది. అలాగే బీజేపీ హైకమాండ్ పిలిచి చిక్కబళ్లాపురం నియోజకవర్గం టికెట్ ఆఫర్ చేసినా సదానంద గౌడ్ అంగీకరించలేదని సమాచారం.
మీరు త్వరగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, ఢిల్లీలోని పెద్దలతో చర్చలు జరుపుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర మాజీ సీఎం సదానంద గౌడకు హామీ ఇచ్చారని వెలుగు చూసింది. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ నివాసానికి వెళ్లి ఆయనలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సంప్రదింపుల సక్సెస్ కాని నేపథ్యంలో బీవై విజయేంద్ర హైకమాండ్ నేతలను కలుస్తానని హామీ ఇచ్చారు.

మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మాజీ ముఖ్యమంత్రి, బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ డీవీ సదానంద గౌడ తెలిపారు. అయితే అధిష్టానం పిలుపుతో ఉదయం సదానంద గౌడ విలేకరుల సమావేశాన్ని వాయిదా వేయడంతో పరోక్షంగా బెంగళూరు నార్త్ నియోజకవర్గం టికెట్‌పై అసంతృప్తితో ఉన్న సదానంద గౌడ్‌కు చిక్కబళ్లాపురం నియోజకవర్గం టికెట్ ఆఫర్ చేసినా అందుకు మాజీ సీఎం సదానంద గౌడ అందుకు అంగీకరించలేదు.
ఎట్టకేలకు ఎంపీ టికెట్ కోసం తిరుగుబాటు హోరు జోరుగా సాగుతోంది. చాలా నియోజకవర్గాల్లో బీజేపీ టికెట్ కోసం పోటీ పడినవాళ్లు చాలా మంది ఉండటంతో బీజేపీ హైకమాండ్ కు పెద్ద తలనొప్పిగా మారడంతో అభ్యర్థుల కొరతతో సతమతమవుతున్న కాంగ్రెస్ కు సదానంద గౌడను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈలోగా మాజీ సీఎం సదానంద గౌడ అసంతృప్తిని చల్లార్చేందుకు బీజేపీ హైకమాండ్ అనేక ప్రయత్నాలు చేస్తున్నది. మాజీ సీఎం సదానంద గౌడ కాంగ్రెస్‌లోకి వెళ్లి బీజేపీకి షాక్ ఇస్తారా ? అన్నది ప్రస్తుతం కర్ణాటకలో ఆసక్తికరంగా మారింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications