వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదం: ఈసీకి ముందే బిజెపి ఐటి సెల్ చీఫ్ తేదీల వెల్లడి

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక శానససభ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రకటించడానికి ముందే బిజెపి ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఆ తేదీలను ట్వీట్ చేశారు. మంగళవారంనాడు ఆయన ఈ పనిచేశారు. దానిపై వివాదం చెలరేగుతోంది.

ఎన్నికల తేదీలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ వెల్లడించడానికి ముందే మాల్వియా పోలింగ్ మే 12వ తేదీన జరుగుతుందని, ఫలితాలు 18వ తేదీన వెలువడుతాయని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

BJP IT cell chief tweets Karnataka Assembly poll dates before EC announcement

చీఫ్ ఎలక్షన్ కమీషనర్ మీడియా సమావేశంలో మాట్లాడుతన్నప్పుడు మధ్యలో ఓ మీడియా ప్రతినిధి జోక్యం చేసుకుని ఈసి అధికారిక ప్రకటన చేయకముందే మాల్వియా ఎలా ప్రకటించారని అడిగారు.

అది చాలా తీవ్రమైన విషయమని, తప్పు జరిగినట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని రావత్ చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ వెళ్లారు.

పోలింగ్ జరిగే తేదీ మాల్వియా వెల్లడించిన తేదీ ఒక్కటే కాగా, ఓట్ల లెక్కింపు తేదీలో మాత్రం మార్పు ఉది. ఓట్ల లెక్కింపు మే 18వ తేదీన జరుగుతుందని మాల్వియా తెలుపగా, ఈసి మాత్రం 15వ తేదీన జరుగుతుందని వెల్లడంచింది.

ఈసి వెల్లడించిన అధికారిక తేదీలు

నోటిఫికేషన్: ఏప్రిల్ 17, 2018
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఏప్రిల్ 24, 2018
నామినేషన్ల పరిశీలన : ఏప్రిల్ 26, 2018
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: ఏప్రిల్ 27, 2018
పోలింగ్ తేదీ : మే 12, 2018
ఓట్ల లెక్కింపు : మే 15, 2018

English summary
Even before the Election Commission announced the dates for the Karnataka Assembly Elections, a controversy erupted over a post by Bharatiya Janata Party (BJP) IT cell chief Amit Malviya on microblogging site Twitter on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X