KGF రాకీ వీడియోతో బీజేపీ సెటైర్..! ఓహో అలా చంపేస్తారా ? కాక్రోచ్ కౌంటర్..!
నీట్ పరీక్ష అక్రమాల నేపథ్యంలో జాతీయ స్దాయిలో బీజేపీపై (BJP) పోరాటం మొదలుపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party). .. ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ తో దాన్ని పతాక స్దాయికి తీసుకెళ్లింది. దీని ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనూహ్యంగా రాజీనామా చేయక తప్పలేదు. అప్పట్లో కాక్రోచ్ జనతా పార్టీ నాయకులతో చర్చలు జరిపి జంతర్ మంతర్ ఆందోళనల్ని విరమింపజేసేందుకు ప్రయత్నించిన బీజేపీ విఫలమైంది.
పార్లమెంట్ మార్చ్ లో విద్యార్ధులు గాయపడ్డాక వారిని బుజ్జగించేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. మరోవైపు వీరికి మద్దతిస్తున్న వారిని మాత్రం దిమాగీ నక్సల్స్ గా పేర్కొంటూ ప్రధాని మోడీ ఆగస్టు 15న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్నాటక బీజేపీ తమ ఎక్స్ హ్యాండిల్ లో దిమాగీ నక్సల్స్ అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇది కేజీఎఫ్ 2 సినిమాలో హీరో రాఖీ తన ప్రత్యర్థుల్ని గన్ తో కాల్పులు జరుపుతున్న వీడియో. రాఖీ లాగే తాము వెనక్కి తగ్గడం లేదని, దిమాగీ నక్సల్స్ ను దీటుగా ఎదుర్కొంటామని బీజేపీ ఇందులో తెలిపింది.

2026. The ruling party is openly threatening to shoot the country’s youngsters dead! Pure evil. They seem to have lost the plot! https://t.co/V0N3VG2NqP
— Saurav Das (@SauravDassss) August 28, 2026
దీనికి కాక్రోచ్ జనతా పార్టీ ఘాటు కౌంటర్ ఇచ్చింది. ఆ పార్టీ సహ కన్వీనర్ గా ఉన్న సౌరవ్ దాస్.. బీజేపీ పోస్ట్ చేసిన వీడియోను రీట్వీట్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు. 2026వ సంవత్సరంలో దేశంలోని యువతను కాల్చి చంపుతామని అధికార పార్టీ బహిరంగంగానే బెదిరిస్తోందని, ఇది పరమ దుర్మార్గమని సౌరవ్ దాస్ పేర్కొన్నారు. వారికి అసలు ఏం చేస్తున్నారో అన్న స్పృహే లేకుండా పోయినట్లుందంటూ ఈ వీడియో పోస్ట్ చేసిన బీజేపీ నేతలకు ఆయన చురకలు అంటించారు.













Click it and Unblock the Notifications