ఇద్దరు భార్యలుండగా మూడో మహిళతో సహజీవనం: బీజేపీ నేతపై కేసు నమోదు!

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మెహర్బాన్ సింగ్ దాంగీపై 30 ఏళ్ల మహిళ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దాంగీకి ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆ మహిళ ఆరోపించింది. ఆ మహిళ కీలక విషయాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. "కులీఖేడా నివాసి అయిన మెహర్బాన్ సింగ్ మా గ్రామానికి తరుచూ వచ్చేవాడు. అలా మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఒక రోజు 'నువ్వు నాకు నచ్చావు, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను' అని చెప్పాడు. నన్ను నమ్మించి, దాదాపు 11 నెలల క్రితం తన సొంత గ్రామమైన కులీఖేడాకు తీసుకెళ్లి భార్యగా తనతో ఉంచుకున్నాడు. ఆ తర్వాత తనకు ఒక మగపిల్లవాడు కావాలంటూ ఒత్తిడి తెచ్చేవాడు."

"తాజాగా నాకు అతని రెండు పెళ్లిళ్ల వాస్తవం తెలిసింది. మొదటి భార్యను ఆమె పుట్టినిల్లు అయిన గుమానిపురాలో వదిలేశాడు. రెండో భార్య ఉపాధ్యాయురాలు, ఆమె ఖిల్చిపూర్‌లో ఉంటుంది. అతనికి రెండో భార్య ద్వారా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ నిజం గురించి నేను మెహర్బాన్ సింగ్‌ను ప్రశ్నించగా.. నాపై దాడి చేశాడు. ఆ దాడి కారణంగా నాకు గర్భస్రావం జరిగింది. ఆ తర్వాత మళ్లీ నేను గర్భం దాల్చేందుకు షాజాపూర్‌లో చికిత్స కూడా చేయించాడు." అని ఆ మహిళ పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు, ఖిల్చిపూర్ పోలీసులు వరకట్న వేధింపులు, దాడి కింద కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు భద్రత కల్పించాలని ఆమె కోరింది.

BJP Leader Booked for Living With Third Woman Despite Having Two Wives

బీజేపీ నాయకుడి వాదన
తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ.. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మెహర్బాన్ సింగ్ దాంగీ ఇలా అన్నారు. "నాపై ఆరోపణలు చేస్తున్న మహిళకు ఇప్పటికే పెళ్లైంది. నేను ఆమెను ఎప్పుడూ నా దగ్గర ఉంచుకోలేదు, కొట్టలేదు. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవి. నేను రెండుసార్లు జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. నన్ను అప్రతిష్టపాలు చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు." అని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంపై పోలీసు విచారణ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+