ఏపీలో స్టార్టప్ స్టార్ట్ చేస్తోన్న మంచు మనోజ్- భూమా మౌనిక

విశాఖపట్నంలో జరుగుతోన్న సీఐఐ సమ్మిట్ ఎన్నో కీలక పరిణామాలకు వేదిక అవుతోంది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ఏర్పాటు చేసిన ఈ సదస్సులో పలు దిగ్గజ కంపెనీలు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటోన్నాయి. వీటిల్లో ఓ స్టార్టప్ ప్రాజెక్ట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రముఖ నటుడు మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక దీనికి కేంద్రబిందువు అయ్యారు. ప్రభుత్వంతో ఓ ఎంఓయూను కుదుర్చుకున్నారు.

భూమా మౌనిక స్థాపించిన నమస్తే వరల్డ్ స్టార్టప్ కు చెందిన ఒప్పందం ఇది. కర్నూలు జిల్లాలో సుమారు రూ. 36 కోట్ల అంచనా వ్యయంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారామె. భారతీయ ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా బొమ్మల తయారీ, హస్తకళల ఉత్పత్తుల ప్రాసెస్ యూనిట్‌ను జిల్లాలో నిర్మించనున్నారు. స్థానిక కళాకారుల ద్వారా హస్తకళలను ఉత్పత్తి చేయడం, దీనికి అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడమే ఈ స్టార్టప్ ప్రధాన ఉద్దేశం.

Actor Manchu Manoj wife Bhuma Mounika signed an MOU with the AP govt for initiative flagship startup

ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ రంగానికి, స్వదేశీ కళాకారులకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. ప్లాస్టిక్ బొమ్మల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తూ, స్వదేశీ హస్తకళలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలని భూమా మౌనిక భావిస్తోన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక మహిళలు, యువతకు పెద్ద సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. రాయలసీమ ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సదుపాయం లభిస్తుంది.

అలిపిరి కాలిబాట మార్గంలో ఇకపై..
అలిపిరి కాలిబాట మార్గంలో ఇకపై..

ఎంఓయూ కుదుర్చుకున్న అనంతరం పలువురు పలువురు మంత్రులు, పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులు మంచు మనోజ్, భూమా మౌనికను అభినందించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో స్వదేశీ ఉత్పత్తుల తయారీ, యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన మౌలిక వసతులు, అనుమతులను వేగవంతం చేస్తామని మంత్రి టీజీ భరత్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.

హైదరాబాద్ సీపీగా ఇక సెలవు: నా మనసును ఎంతగానో కదిలించింది
హైదరాబాద్ సీపీగా ఇక సెలవు: నా మనసును ఎంతగానో కదిలించింది

ఏపీ రాజకీయాల్లో భూమా కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మౌనిక సోదరి భూమా అఖిలప్రియ మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే. మొదట్లో మౌనిక కూడా రాజకీయ అరంగేట్రం చేస్తారనే ప్రచారం చాలాకాలంగా కొనసాగింది గానీ.. వీటికి తెరదించుతూ ఆమె పారిశ్రామికవేత్తగా ఎదిగే ప్రయత్నం చేస్తోన్నారు. ఎంఓయూ కుదుర్చుకున్న నేపథ్యంలో నమస్తే వరల్డ్ స్టార్టప్ స్థాపన పనులు వేగవంతం కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+