బీజేపీ నేత దారుణ హత్య: మావోయిస్టుల పనేనా?

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భోపాలపట్నంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు జగదీష్ కొండర దారుణ హత్యకు గురయ్యారు. మావోయిస్టులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి.

 BJP leader hacked to death in Chhattisgarh

భోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధికి సుమారు 300 మీటర్ల దూరంలోనే జగదీష్ హత్యకు గురయ్యారు. అయితే జగదీష్‌ని ఎవరైనా పాతకక్షలతో హత్య చేశారా..? లేక మావోయిస్టులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ విషయమై బీజాపూర్ జిల్లా ఎస్పీ దృవ్‌ని వివరణ కోరగా.. జగదీష్ హత్యకు గురైన విషయం వాస్తవమేనని తెలిపారు. ఇది మావోయిస్టులు చేసిన పని అని ఇంకా నిర్ధారించలేదని ఆయన చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+