కశ్మీర్‌లో కాల్పుల మోత, బీజేపీ నేత, తండ్రి, సోదరుడు మృతి.. సెక్యూరిటీ గార్డ్స్ అరెస్ట్..
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఈ సారి బీజేపీ నేత లక్ష్యంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో నేత సహా అతని తండ్రి, సోదరుడు కూడా చనిపోయాడు. బుధవారం రాత్రి బందిపోర కాల్పులతో దద్దరిల్లగా.. మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కాల్పులతో బందిపోర ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
బందిపోర జిల్లా అధ్యక్షుడు వసీమ్ బరీకి పీఎస్ సమీపంలో షాపు ఉంది. అందులో అతను సహా తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్ ఉంటారు. అయితే వసీమ్‌ను మిలిటెంట్లు లక్ష్యం చేసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో కాల్పులతో విరుచుకుపడ్డారు. వాస్తవానికి వసీమ్‌కు 10 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. కానీ వారు ఎదురు కాల్పులు జరపలేదు. కాల్పుల్లో వసీమ్ అక్కడికక్కడే నెలకొరగగా.. అతని తండ్రి, సోదరుడు ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయారు.

Recommended Video
కాల్పుల ఘటనను బీజేపీ నేత రాం మాధవ్ ఖండించారు. ఫైరింగ్ జరపడంతో ముగ్గురు చనిపోయారని తెలిసి షాక్ నకు గురయ్యానని తెలిపారు. ఘటనపై మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఖండించారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications