బీజేపీ మహిళా నేత ఛాతీపై కాల్పులు, అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భర్త ఘాతుకం..
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల మోత మోగింది. గురుగ్రామ్ సెక్టార్ 10-ఏ పరిధిలో గల ఇంటిలో కాల్పుల శబ్దంతో చుట్టుపక్కల వారు హడలెత్తిపోయారు. వెంటనే వచ్చి చూసేవరికి బీజేపీ మహిళా నేత మునేశ్ గోధారా రక్తపుమడుగులో పడి ఉన్నారు. భార్యపై కాల్పులు జరిపిన భర్త సునీల్ గోధారా ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. అతని కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలను చేపట్టాయి.

2001లో వివాహం..
మునేశ్-సునీల్‌కు 2001లో వివాహామైంది. వీరి కాపురం అన్యోన్యంగా సాగుతోంది. సునీల్ గోధారా మాజీ ఆర్మీ ఉద్యోగి. ప్రస్తుతం గురుగ్రామ్‌లో కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. మునేశ్ గోదారా 2013లో బీజేపీ అనుబంధ సంస్థ ‘మహామంత్రి అనే మహిళా విభాగం'లో చేరారు. క్రమంగా ఎదుగుతూ.. గురుగ్రామ్ బీజేపీ కిషాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి స్థాయికి వచ్చారు. అయితే దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది.

వీడియోకాల్ మాట్లాడుతుండగా..
శనివారం సాయంత్రం మునేశ్ తన సోదరితో వీడియో కాల్ మాట్లాడుతోంది. ఇప్పటికే మునేశ్‌పై సునీల్‌కు అనుమానం ఉంది. ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానిస్తున్నాడు. అలా వీడియో కాల్ మాట్లాడటంతో వారితో మాట్లాడుతోందని భావించాడు. వెంటనే తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ గన్‌తో కాల్పులు జరిపాడు. రౌండు రౌండ్ల కాల్పులు మునేశ్ ఛాతీపై జరపడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఘటనాస్థలంలోనే ఆమె చనిపోయారు. దీంతో అక్కడినుంచి సునీల్ మెల్లగా జారుకున్నారు.

నిరాధారం..
మునీశ్‌కు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందనే సునీల్ ఆరోపణలను కుటుంబసభ్యులు కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని చెప్తున్నారు. సునీల్ సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications