రాహుల్ ఎంతో మారిపోయాడు-ప్రతీదీ ఓ సంకేతమే-స్మృతీ ఇరానీ పొగడ్తలు..!
ఒకప్పుడు కాంగ్రెస్ యువరాజుగా ప్రత్యర్థులు విమర్శలు చేసిన రాహుల్ గాందీ ఇప్పుడు లోక్ సభలో ప్రతిపక్ష నేత హోదాలో దుమ్మురేపుతున్నారు. గతంలో పార్లమెంట్ కు రాడని విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ ఇప్పుడు రెగ్యులర్ గా హాజరవుతూ అధికార పక్షంపై దీటుగా విమర్శలు చేస్తున్నారు. ఇదంతా ఆయనలో వచ్చిన మార్పుకు సంకేతంగా దేశంలో మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. అయితే ఇందులో ఇప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థి, గతంలో ఆయన్ను ఓడించిన స్మృతీ ఇరానీ కూడా చేరిపోయారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాజీ కేంద్రమంత్రి స్మృృతీ ఇరానీ రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు. రాహుల్ లో వచ్చిన మార్పుపై అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానాలు ఇప్పుడు సొంత పార్టీ బీజేపీ నేతలకు సైతం షాకిచ్చాయి. ఒకప్పుడు అమేథీలో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతీ ఇరానీ తాజా ఎన్నికల్లో ఆయన ఆఫీసులో పనిచేస్తున్న కిషోరీ లాల్ శర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో వచ్చిన మార్పో ఏమో తెలియదు కానీ స్మృతీ ఇరానీ రాహుల్ పై చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.

Whether you like it or not, but Rahul Gandhi’s politics has changed.
— Shantanu (@shaandelhite) August 28, 2024
He is giving a message to the youths of the country through his white T-shirt.
— BJP leader Smriti Irani pic.twitter.com/qsdCIwFE2z
రాహుల్ గాందీ రాజకీయంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోందని స్మృతీ ఇరానీ వెల్లడించారు. తాను గెలుపు రుచి చూసినట్లు భావిస్తున్నాడన్నారు. రాహుల్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడికి వెళ్లినా కులం గురించి మాట్లాడుతున్నారని, అంతే కాదు రాజకీయాల్లో ఇదెంత కీలకమూ చూపిస్తున్నాడన్నారు. పార్లమెంట్ లో తెల్ల టీషర్ట్ వేసుకుని హాజరు కావడం ద్వారా యువతకు ఓ సందేశం ఇచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఇరానీ తెలిపారు. ఇదంతా మనకు నచ్చినా నచ్చకపోయినా భిన్నమైన రాజకీయం చేస్తున్నట్లు మాత్రం అనిపిస్తోందన్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications