లేడీ కిమ్ ఎందుకు అడ్డుకుంటోంది..? మళ్లీ భగ్గుమన్న బెంగాల్

కోల్‌కతా: చాలాకాలం తర్వాత బెంగాల్‌లో మళ్లీ హింస చెలరేగింది. బీజేపీ తలపెట్టిన నబన్నా క్యాంపెయిన్‌లో భాగంగా ఈ హింస చెలరేగింది. బెంగాల్ విపక్ష నేత సువేంధు అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. క్యాంపెయిన్ ప్రారంభం కాకముందే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇటు పోలీసులకు అటు బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. సువేంధు అధికారితో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాకెట్ ఛటర్జీని కూడా పోలీసులు అరెస్టు చేశారు.వీరిని కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు.

మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతి పద్ధతులను అవలంబిస్తోందని బీజేపీ ఆరోపిస్తూ దీనికి నిరసనగా నబన్నా మార్చ్‌ను కాషాయం పార్టీ తలపెట్టింది. బీజేపీ పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు రైళ్లలో కోల్‌కతాకు చేరుకుంటున్నారు.దీంతో రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గాలన్నిటినీ బారికేడ్లతో మూసివేశారు.ఇదిలా ఉంటే అరెస్టు చేసే సమయంలో మహిళా పోలీసులు కూడా సువేంధుపై చేయి వేయడంతో వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పోలీసులు తనపై చెయ్యి ఎలా వేస్తారని ప్రశ్నించారు.ఆ ఏరియాలోని ఐపీఎస్ అధికారి వెంటనే రావాలంటూ ఆయన డిమాండ్ చేశారు. దీంతో దక్షిణ కోల్‌కతా డిప్యూటీ కమిషనర్ ఆకాష్ మఘారియా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయనతో సువేందు అధికారి వాగ్వాదానికి దిగారు.

BJP leader Suvendu Adhikari arrested,says why is lady Kim Mamata stopping us

మహిళా పోలీసులు తనను తాకుతున్నారని వారెలా ఇలా ప్రవర్తిసారంటూ ప్రశ్నించిన సువేందు అధికారి ఈ ఘటనపై కోర్టుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఇందుకు మహిళా పోలీసులు లేదా పురుష పోలీసులంటూ ఎలాంటి బేదము తమ ఫోర్స్‌లో లేదని డీసీపీ సమాధానం ఇచ్చారు.ఇదిలా ఉంటే మమతా బెనర్జీకి బీజేపీ అంటే చెమటలు పడుతున్నాయని అందుకనే తమ యాత్రను అడ్డుకుంటోందని లాకెట్ ఛటర్జీ మండిపడ్డారు."ప్రజాస్వామ్యంలో ఉన్నామా మరెక్కడైనా ఉన్నామా... నన్నెందుకు అడ్డుకుంటున్నారు. అరాచకానికి కూడా ఓ హద్దుంటుంది.లేడీ కిమ్‌కు చెప్పండి, మిడ్నాపూర్ భారత్‌లోనే ఉందని. బెంగాల్‌ను మమతా ఉత్తరకొరియాగా మార్చుతోంది" అంటూ సువేందు అధికారి బెంగాల్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

BJP leader Suvendu Adhikari arrested,says why is lady Kim Mamata stopping us

ఇదిలా ఉంటే 2021 తర్వాత అతిపెద్ద బీజేపీ మార్చ్‌గా నబన్న అభియాన్ యాత్ర నిలిచింది.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొన్ని వేలమంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.హల్దియా నందిగ్రామ్‌లలో పోలీసులు బీజేపీ కార్యకర్తల వాహనాలను నిలిపివేశారు. బీజేపీ ప్రణాళిక ప్రకారం మూడు మార్గాల ద్వారా ఆ పార్టీ కార్యకర్తలు నబన్నా (సెక్రటేరియట్)ముట్టడి చేయాల్సి ఉంది.ఇక బీజేపీ తలపెట్టిన ఈ సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమంతో కోల్‌కతాలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+