సీఎం సీటు అమ్మేస్తున్నారు. ఎల్ కే అద్వాణి మాట ఎవరు నిలబెట్టారు ?, రాహుల్ గాంధీ !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యువరాజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచారం సందర్బంగా బీజేపీ నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ ఇదే సమయంలో కర్ణాటక ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ ఉన్న తేడాను రాహుల్ గాంధీ వివరిస్తున్నారు.
జీవర్గిలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. కల్యాణ కర్ణాటకకు ప్రత్యేక హోదా కల్పిస్తామని గతంలో బీజేపీ నాయకుడు ఎల్ కే అద్వాణి చెప్పారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కల్యాణ కర్ణాటకకు ప్రత్యేక హోదా కల్పించిందని, ఈ ప్రాంతంలోని ప్రజలకు వేలాది ఉద్యోగాలు వచ్చాయని రాహుల్ గాంధీ అన్నారు.

అయితే దానిని బీజీపీ నాయులు సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అప్పట్లో కల్యాణ కర్ణాటక ప్రాంతం అభివృద్ది కోసం రూ. 3, 000 కోట్లు నిధులు విడుదల అయితే బీజేపీ మాత్రం 12 శాతం నిధులు మాత్రమే సద్వినియోగం చేసుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్యాణ కర్ణాటక ప్రాంతంలోని ప్రతి మండలానికి రూ. 5, 000 కోట్లు నిధులు మంజూరు చేస్తామని, ప్రతి గ్రామ పంచాయితీకి రూ. 1 కోటి నిధులు కేటాయిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్యాణ కర్ణాటకకు ప్రత్యేక ప్యాకేజీలు విడుదల చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు.
కర్ణాటకలో ఇంతకాలం 40 శాతం కమీషన్ ప్రభుత్వం ఉండేది, ఏ పనిజరగాలన్నా 40 శాతం కమీషన ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ నాయకులు సీఎం కుర్చీని రూ. 2, 500 కోట్లకు అమ్మేశారని స్వయంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే (బీజేపీ ఎమ్మెల్యే) చెప్పారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

బళ్లారిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ ప్రాంతం అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బళ్లారిలో జీన్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్యాణ కర్ణాటకలో ఐఐటీ. ఐఐఏం ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంత ప్రజలకు వేలాది ఉద్యోగాలు వస్తాయని రాహుల్ గాంధీ అన్నారు.
అంతకు ముందు మాజీ సీఎం ధర్మసింగ్ కుమారుడు అజయ్ సింగ్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి మంగళూరు నుంచి హెలికాప్టర్ లో బయలుదేరడానికి సిద్దం అయిన రాహుల్ గాంధీ వాతవరణం సకరించకపోవడంతో రోడ్డు మార్గంలో జీవర్గికి వెళ్లారు. అయితే జీవర్గీలో గంట పాటు విపరీతంగా వర్షం కురవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.












Click it and Unblock the Notifications