విజయ్ రాజకీయాల్లోకి రావాలి, మోడీ జోక్యం వద్దు, స్వార్థం కోసం బీజేపీలో: హీరో తండ్రి క్లారిటీ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళ సినిమా మెర్సల్ హీరో విజయ్ విషయంలో బీజేపీ నాయకులు రచ్చరచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇంత కాలం మౌనంగా ఉన్న విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ. చంద్రశేఖర్ మంగళవారం మీడియా ముందు స్పందించారు. విజయ్ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్న కొందరు బీజేపీ నాయకుల మీద మండిపడ్డారు.

మెర్సల్ సినిమా మీద కేసు నమోదు, హిందువుల గురించి, బీజేపీకి థ్యాక్స్ చెప్పిన టీటీవీ దినకరన్ !

కొందరు బీజేపీ నాయకులు విజయ్ విషయంలో మతిలేకుండా మాట్లాడుతున్నారని, వారికి బుద్ది మందగించిందని ఎస్ఏ. చంద్రశేఖర్ విమర్శించారు. తన కుమారుడిని జోసెఫ్ విజయ్ అని పిలుస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. విజయ్ క్రిస్టియన్ అని చెప్పడం విచారకరం అన్నారు. తన పేరు చంద్రశేఖర్ అంటే శివుడు అనే అర్థం వస్తుందని, ఇప్పుడు బీజేపీ నాయకులు ఏమని సమాధానం ఇస్తారని ప్రశ్నించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Veteran film director S A Chandrasekhar, father of actor Vijay, has said some BJP leaders are not matured enough and it was obvious with their remarks calling his son a Christian. Speaking to the media, he said, They call him Joseph Vijay.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి