మహారాష్ట్రలో ట్విస్టులు-ఫిరాయింపులపై బీజేపీ ఆశలు ఆవిరి ? సరిపోకపోతే రాష్ట్రపతి పాలన డిమాండ్
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఉద్ధవ్ ధాక్రే ప్రభుత్వంలో సీనియర్ మంత్రి ఏక్ నాథ్ షిండే ఇవాళ శివసేనకు చెందిన తోటి ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు. అంతిమంగా బీజేపీలోకి ఫిరాయించేందుకు రంగం సిద్దం చేసుకుంటన్నారు. అయితే అదే సమయంలో షిండే ఫిరాయింపుల ఎపిసోడ్ బీజేపీకి పనికొచ్చేలా కనిపించడం లేదు దీంతో రాష్ట్రపతి పాలన కోసం బీజేపీ ప్లాన్ చేస్తోంది.
మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇవాళ ఏక్ నాథ్ షిండే క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టడంతో శివసేన కంగుతింది. అయితే వెంటనే పార్టీలో కీలక నేతలతో సీఎం ఉద్ధవ్ చర్చలు ప్రారంభించారు. అదే సమయంలో మరీకొంతమంది ఎమ్మెల్యేలు షిండే క్యాంపులో చేరారు. అయితే ఈ సంఖ్య దాదాపు 35గా కనిపిస్తోంది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న పార్టీల బలాబలాలు చూస్తే భారీ ఎత్తున ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయిస్తే తప్ప ప్రభుత్వం పడిపోవడం అసాధ్యం. దీంతో బీజేపీతో రాయబారాలు చేస్తున్న శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు తమ క్యాంపులోకి మిగతా వారిని కూడా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నడుపుతున్న మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి 168 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలకు 113 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇతరులు మరో 6 సీట్లలో ఉన్నారు. ఓ సీటు ఖాళీగా ఉంది. అయితే అధికార కూటమి నుంచి 26 మంది శివసేన ఎమ్మెల్యేలు బీజేపీలోకి పిరాయించినా ఆ పార్టీ మ్యాజిక్ మార్కు అయిన 144 సీట్లను చేరుకునేలా కనిపించడం లేదు. దీంతో అంతిమంగా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసేందుకు సిద్దమవుతోంది..












Click it and Unblock the Notifications