భార్య బట్టలు చించి మరీ.. అక్రమ సంబంధం అనుమానంతో!: బీజేపీ నేత దాష్టికం

Subscribe to Oneindia Telugu

ఆగ్రా: ఉత్తరప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత వినయ్ శర్మ పీకలదాకా మద్యం సేవించి భార్య నుపుర్ శర్మపై దాడి చేశారు. అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ.. జుట్టు పట్టుకుని ఆమెను బయటకు ఈడ్చుకొచ్చి ఇష్టమొచ్చినట్టు కొట్టారు.

వీరు నివాసముంటున్న ఆగ్రా లాయర్స్ కాలనీలోని శివాలిక్ అపార్టుమెంట్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వినయ్ శర్మ, నుపుర్ శర్మలకు 2014లో వివాహమైంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. కొన్నాళ్లు సాఫీగానే సాగిన వీరి కాపురంలో భర్త అనుమానం చిచ్చు పెట్టింది.

అనుమానంతో నిత్యం భార్యను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు వినయ్ శర్మ. తాగి ఇంటికి రావడం, ఆమెను చితకబాదడం అతనికి అలవాటైంది. తాజాగా 10మంది అనుచరులను వెంటపెట్టుకుని వచ్చిన వినయ్ శర్మ.. నుపుర్ శర్మ బట్టలు చించి మరీ ఆమెపై దాడి చేశాడు. కొడుకును తీసుకుని వెళ్లిపోయాడు.

భర్త వినయ్ శర్మ వేధింపులు నానాటికీ పెరిగిపోతుండటంతో భార్య నుపుర్ పోలీసులను ఆశ్రయించింది. సాక్ష్యాధారంగా సీసీటీవి ఫుటేజీని కూడా అందజేసింది. దీంతో పోలీసులు నిందితుడైన వినయ్ శర్మపై ఐపీసీ 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నుపుర్ ఫిర్యాదు అనంతరం వినయ్ శర్మ కూడా ఆమెపై ఫిర్యాదు చేశారు. తన భార్య య బంగారు నగలు, నగదును ఎత్తుకెళ్లిందని, తనను చంపుతానని బెదిరిస్తుందని ఆరోపించారు. దీంతో పోలీసులు ఇరువురి తరుపు నుంచి కేసులు నమోదు చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A senior BJP party worker was caught in a CCTV camera assaulting his wife. For the last three years, I have trying to be a good wife and do not even interact with the neighbours.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి