వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్ పై పోటీకి అపర్ణా - బీజేపీ కొత్త వ్యూహం : అదే జరిగితే..గెలిచేదెవరు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠగా మారుతున్నాయి. బీజేపీ వర్సెస్ సమాజ్ వాదీ పార్టీల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో ప్రచారం సాగుతోంది. ఒక పార్టీ పైన మరో పార్టీ మాటల తూటాలు పేల్చుతోంది. ఇదే సమయంలో ముఖ్య నేతల పోటీ పైన ఉత్కంఠ పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన వెంటనే యోగి కేబినెట్ లోని పలువురు మంత్రులు..ముఖ్య నేతలను తమ పార్టీలోకి చేర్చుకొని అఖిలేష్ షాక్ ఇచ్చారు. ఆ తరువాత అదే స్థాయిలో అఖిలేష్ కు చెందిన ముఖ్య నేతలను బీజేపీ తమ పార్టీలో చేర్చుకోవటం ద్వారా కౌంటర్ ఇచ్చింది.

Recommended Video

UP Assembly Elections 2022 : BJP Releases 6th Candidates List | Oneindia Telugu
కర్హాల్ నుంచి అఖిలేష్ భేటీ

కర్హాల్ నుంచి అఖిలేష్ భేటీ

ఇక, ఈ ఎన్నికల్లో తొలి సారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న అఖిలేష్ యాదవ్ క‌ర్హాల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసారు. ఇప్పటికే యూపీ సీఎం యోగీ లక్ష్యంగా అఖిలేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ నేతలు సైతం అఖిలేషన్ ను టార్గెట్ చేస్తున్నారు. అఖిలేష్ అసెంబ్లీ బరిలో నిలవటంతో..ఆయన పైన పోటీకి బీజేపీ ఎవరిని ప్రయోగిస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటి వరకు అఖిలేష్ పోటీ చేస్తున్న కర్హాల్ నుంచి తమ అభ్యర్ధిని ఖరారు చేయలేదు. ఇటీవల బీజేపీ తీర్థంపుచ్చుకున్న ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్‌ను అక్కడి నుంచి బరిలో నిలపాలన్న యోచనలో బీజేపీ ఉన్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పోటీగా అపర్ణా యాదవ్

పోటీగా అపర్ణా యాదవ్

అపర్ణా యాదవ్‌ను బరిలోకి నిలపడం ద్వారా అఖిలేష్ యాదవ్‌ ను ఆత్మరక్షణలో పడేయాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. దీని ద్వారా ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో చీలికను ఎత్తిచూపడం ద్వారా రాజకీయ లబ్ధి చేకూరుతుందని అంచనావేస్తున్నారు. అయితే, అపర్ణా యాదవ్ పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది స్పష్టత రాలేదని చెబుతున్నారు. అఖిలేష్ పైన అపర్ణా యాదవ్ ను పోటీకి దించితే అక్కడ పోరు మరింత రసవత్తంగా మారే అవకాశం ఉంది.

యెగీ వర్సస్ అఖిలేష్ గా పోటీ

యెగీ వర్సస్ అఖిలేష్ గా పోటీ

ఉత్తర ప్రదేశ్ లోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 14న రెండో విడత ఎన్నికలు, ఫిబ్రవరి 20న మూడో విడత, ఫిబ్రవరి 23న నాలుగో విడత, ఫిబ్రవరి 27న ఐదో విడత, మార్చి 3న ఆరో విడత, మార్చి 7న ఏడో విడత(చివరి) ఎన్నికలకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే, ఇప్పుడు బీజేపీ నుంచి అఖిలేష్ పైన పోటీ చేసే వారెవరనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

English summary
BJp may field Aparana yadav against Akhilesh yadav at karhal seat
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X