జేడీయూకు డిప్యూటీ స్పీకర్ పదవి? వైసీపీని బీజేపీ పక్కనబెట్టిందా?
ఢిల్లీ : లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఏ పార్టీకి కేటాయిస్తారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. భాగస్వామ్య పక్షాలకు కాకుండా ఇతర పార్టీలకు ఆ పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీకి డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు అప్పజెప్తారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా రేసులో జేడీఎస్, బీజేడీల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మోడీ వైసీపీని పక్కనబెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

డిప్యూటీ స్పీకర్ రేసులో వైసీపీ
లోక్‌సభలో అధికారపార్టీ తమకు అనుకూలంగా ఉండే మరో పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి అప్పగించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో బీజేపీకి అనుకూలంగా ఉంటూ సంఖ్యాబలం ఉన్న పార్టీ వైసీపీయే. ఈ నేపథ్యంలో ఆ పార్టీకే డిప్యూటీ పగ్గాలు అప్పగించే అవకాశముందన్న వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే వైసీపీ బహిరంగంగా మోడీ ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశం లేదు. ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామన్న జగన్ ఎన్డీఏ సర్కారులో చేరితే ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో భాగస్వామి కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవి స్వీకరించి మోడీ సర్కారుకు వైసీపీ సహకరిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

వైసీపీకే పక్కనబెట్టినట్లేనా?
2021 వరకు రాజ్యసభలో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేదు. ఈ పరిస్థితుల్లో ఎగువ సభలో ఏవైనా బిల్లులు పాస్ కావాలంటే వైసీపీ తదితర పార్టీల మద్దతు అవసరం. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక జరిగితే ఆ సీట్లన్నీ వైసీపీ ఖాతాలోనే పడతాయి. ఈ నేపథ్యంలో జగన్ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ ఇవ్వజూపినట్లు తెలుస్తోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మోడీ ఈ విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

జేడీయూతో చెడిన దోస్తానా
మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యం లభించలేదన్న కారణంతో నితీశ్ నేతృత్వంలోని జేడీయూ బీజేపీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో బీహార్‌లో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు ఘన విజయం సాధించాయి. అయితే ప్రస్తుతం అలకబూనిన నితీశ్‌ను ఒప్పించేందుకు డిప్యూటీ స్పీకర్ పోస్టును ఆ పార్టీకి ఇచ్చేందుకు మోడీ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ సైతం డిప్యూటీ స్పీకర్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ పోస్టు జేడీయూకే దక్కే అవకాశముందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
-
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు!












Click it and Unblock the Notifications