నితీష్‌కు మోడీ షాక్: యూపి, బీహార్లలో బిజెపిదే హవా
పాట్నా/లక్నో: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ హవానే కొనసాగనుందట. సిఎన్ఎన్-ఐబిఎన్ సర్వే ప్రకారం.. యూపి, బీహార్ రాష్ట్రాల్లో బిజెపి అత్యధిక స్థానాల్లో విజయం సాధించనుంది. బీహార్, యూపిలు హిందీ మాట్లాడే కీలక రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల్లోనే 120 లోకసభ స్థానాలు ఉన్నాయి.
వీటిలో బిజెపి 63-79 స్థానాల వరకు గెలుచుకోనుంది. ఉత్తర ప్రదేశ్‌లో 80 లోకసభ స్థానాలు, బీహార్‌లో 40 లోకసభ స్థానాలు ఉన్నాయి. యూపిలో 41-49, బీహార్‌లో 22-30 వరకు బిజెపి గెలుచుకునే అవకాశాలున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు రాష్ట్ర ప్రజలు షాకివ్వనున్నారు.

ఆయనకు చెందిన జెడి(యు) పార్టీ కేవలం నాలుగు నుండి ఎనిమిది సీట్లకే పరిమితం కానుందట. ఇక మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జెడి కూడా ఆరు స్థానాల్లోపే పరిమితం కానుంది. ఉత్తర ప్రదేశ్‌లో బిఎస్పీకి ఎనిమిది నుండి పద్నాలుకు, ఎస్పీకి పదకొండు నుండి, పదిహేడు, కాంగ్రెసుకు ఐదు నుండి తొమ్మిది సీట్లు దక్కవచ్చు.
కాంగ్రెస్ సర్దుబాటు
బీహార్‌లో ఆర్జెడి, న్సీపి, కాంగ్రెసులు లౌకిక కూటమిగా ఏర్పడేందుకు ఒప్పందం చేసుకున్నాయి. కాంగ్రెసుకు ఇస్తామన్న పదకొండు సీట్లకు అదనంగా ఔరంగాబాద్ స్థానాన్ని కూడా ఇస్తున్నట్లు లాలూ చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఈ కూటమి కాంగ్రెసు 12, ఎన్సీపి 1, ఆర్జెడి 27 స్థానాల్లో పోటీ చేయనుంది.












Click it and Unblock the Notifications