కరోనా కాటుకు బీజేపీ ఎమ్మెల్యే బలి: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస

జైపూర్: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి మరో ప్రజా ప్రతినిధురాలు కన్నుమూశారు. భారతీయ జనతా పార్టీ శాసన సభ్యురాలు కిరణ్ మహేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన పడిన ఆమె కొద్దిరోజులుగా హర్యానా గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి కిందట మరణించారు. ఆమె మరణం పట్ల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు.

కిరణ్ మహేశ్వరి..రాజస్థాన్‌లోని రాజసమంద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఆమె విజయం సాధించారు. అన్‌లాక్ అనంతరం ఆమె విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ బారిన పడ్డారు. మూడు వారాల కిందట కరోనా లక్షణాలతో మేదాంత ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమెకు ఆధునిక వైద్య చికిత్సను అందిస్తూ వచ్చారు డాక్టర్లు. ఆమె అరోగ్యం కుదుటపడలేదు.

BJP MLA from Rajasthans Rajsamand Kiran Maheshwari passes away due to COVID19

దీనితో రెండు రోజుల కిందట ఐసీయూకు తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలిత రాలేదు. కిరణ్ మహేశ్వరి భౌతిక దేహాన్ని మేదాంత ఆసుపత్రి నుంచి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు తరలించనున్నారు. సోమవారమే అంత్యక్రియలను నిర్వహిస్తారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఆమె మరణం ఓం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మహిళ స్యయం సాధికారత కోసం ఆమె శ్రమించారని చెప్పారు. సుదీర్ఘకాలం పాటు ప్రజాసేవలో గడిపారని అన్నారు.

Recommended Video

    Rajasthan : దిగ్భ్రాంతికర ఘటన, గోశాలలో మరణ మృదంగం... నురగలు కక్కుతూ గోవులు మృత్యువాత...!!

    నియోజకవర్గంలో ప్రజా సంక్షేమం కోసం అనేక చర్యలను చేపట్టారని గుర్తు చేశారు. కిరణ్ మహేశ్వరి మృతిపట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు విజయరాజె సింధియా సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఆమె మరణం పార్టీకి తీరని లోటు అని విజయరాజె సింధియా సంతాపం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మహిళల తరఫున వినిపించే గళం మూగబోయిందని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+