వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుర్రానికి కృత్రిమ కాలు: బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో బీజేపీ నిరసన సందర్భంగా తీవ్రంగా గాయపడిన పోలీసు అశ్వ దళంలోని గుర్రం (శక్తిమాన్) అనే గుర్రానికి కృత్రిమ కాలు అమర్చారు. దీని కోసం జరిగిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. కృత్రిమ కాలుపై గుర్రం లేచి నిలబడుతోందని ఆపరేషన్ చేసిన డాక్టర్ ఖంబాటా తెలిపారు.

ఎమ్మెల్యే దాడిలో గాయపడ్డ గుర్రం (శక్తిమాన్) ప్రాణాలు కాపాడేందుకు దాని కాలును తొలగించాలని సైనిక వైద్యులు గురువారం నిర్ణయించారు. అలా చేయకుండా అలాగే ఉంచేస్తే గాంగరిన్ కారణంగా అది చనిపోయే ప్రమాదం ఉండటంతో కాలును శుక్రవారం ఆపరేషన్ చేసి తొలగించారు.

ఇదిలా ఉంటే గుర్రాన్ని కర్రతో విచక్షణా రహితంగా కొట్టిన కేసులో ముస్సోరి బీజేపీ ఎమ్మెల్యే గణేశ్‌జోషిని డెహ్రాడూన్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. సోమవారం బీజేపీ చేపట్టిన భారీ నిరసన ప్రదర్శనలో ఆందోళన కారులను అడ్డుకునేందుకు పోలీసులు గుర్రాలపై వచ్చి చెదరగొట్టారు.

 గుర్రానికి కృత్రిమ కాలు: బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

గుర్రానికి కృత్రిమ కాలు: బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

నిరసనలో పాల్గొన్న ఓ వ్యక్తి మాత్రం శక్తిమాన్ మీద పోలీసు స్వారీ చేస్తుండగా దాని కళ్లెం పట్టుకుని లాగేశాడు. దాంతో అది కింద పడిపోయింది. ఈ క్రమంలో సదరు బీజేపీ ఎమ్మెల్యే గుర్రంపైకి ఎమ్మెల్యే కర్ర ఎత్తిన ఫొటోలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జాలి, దయ అనేవి మరచిపోయి అమానుషంగా వ్యవహరించారంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.

 గుర్రానికి కృత్రిమ కాలు: బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

గుర్రానికి కృత్రిమ కాలు: బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

ఈ క్రమంలో గుర్రంపై దాడిచేసి పదే పదే కర్రతో కోట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే గణేశ్‌జోషి చికిత్సా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, తాను దాడి చేశాననడం సరికాదని అన్నారు. మానవతా హృదయంతో గుర్రాన్ని చూడడానికి వచ్చానని చెప్పారు. తాను కర్ర ఎత్తిన మాట నిజమే కానీ గుర్రాన్ని కొట్టలేదని అన్నారు.

గుర్రానికి కృత్రిమ కాలు: బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

గుర్రానికి కృత్రిమ కాలు: బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

ఎమ్మెల్యే ముందు నుంచి కర్రతో అదిలిస్తుంటే వెనుకవైపునుంచి దాని కళ్లాలు లాగి పడదోశాడన్న ఆరోపణపై ప్రమోద్‌బోరా అనే బీజేపీ కార్యకర్తను నైనిటాల్ జిల్లా హల్‌ద్వానీలో అరెస్టు చేశారు. ముందు నుంచి దాడి, వెనుకనుంచి కళ్లాలు లాగడం ఈ రెండూ గుర్రం పడిపోవడానికి కారణమని డెహ్రాడూన్ ఎస్‌ఎస్పీ సదానంద్ దాతే చెప్పారు.

 గుర్రానికి కృత్రిమ కాలు: బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

గుర్రానికి కృత్రిమ కాలు: బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ గుర్రం పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. విధి నిర్వహణలో ఉన్న గుర్రం గాయపడినందుకు తాను ఎంతో బాధపడుతున్నానని, ఇది ఒక క్షతగాత్రుడైన సైనికుడితో సమానమని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా ఆ గుర్రం త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. శక్తిమాన్‌కు చికిత్స కోసం విరాళాలు కూడా వచ్చిపడుతున్నాయి.

English summary
Police Friday arrested BJP MLA Ganesh Joshi, accused of assaulting a police horse ‘Shaktiman’ during a protest march here recently which led to amputation of one of its hind legs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X