ఫ్యూన్ ఉద్యోగంలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే కొడుకు, తండ్రి స్పందన..
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కొడుకు నాలుగో తరగతి అయిన గుమస్తా ఉద్యోగంలో చేరాడు. దీనికి ఎమ్మెల్యే అయిన ఆయన తండ్రి అడ్డు చెప్పకపోవడం గమనార్హం. రాజకీయ నాయకులు తమ బిడ్డలను కూడా రాజకీయాల్లోకి తీసుకు రావడమో.. లేక మరో వ్యాపారరంగంలో ఉంచడమో చేస్తుంటారు.
అలాంటిది రెండుసార్లు ఎన్నికలలో గెలిచి, అందునా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఓ నేత చదువబ్బని కొడుకును రాజకీయాల్లోకి తెచ్చే ప్రసక్తే లేదని చెప్పడం గమనార్హం. రాజస్థాన్‌లో హీరాలాల్ వర్మ ఎస్సీ సామాజిక వర్గ బీజేపీ ఎమ్మెల్యే. 8వ తరగతి మాత్రమే చదివిన తన కుమారుడు హన్స్‌రాజ్‌ను వ్యవసాయశాఖలో ప్యూన్ ఇంటర్వ్యూకు పంపారు.

వాడి చదువుకు అంతకన్నా పెద్ద ఉద్యోగం కావాలనుకోవటం అత్యాశేనని, సొంత వ్యాపారంగానీ, ఇతర పనులుగానీ అప్పగించాలనుకోవటం లేదని, రాజకీయాలకు అస్సలు సరిపోడని హీరాలాల్ చెప్పారు. ప్రస్తుతం హన్సరాజ్ రూ.5 వేల జీతంలో ఓ క్లినిక్‌లో పని చేస్తున్నాడు.
ఎమ్మెల్యే హీరాలాల్ మూడు సబ్జెక్టుల్లో పీజీ చేశారు. గోల్డ్‌మెడల్ కూడా సాధించారు. సాంఘిక సంక్షేమశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేశారు. పెద్ద కుమారుడు వ్యాపారం చేస్తుండగా, రెండో కుమారుడు డిగ్రీ చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.












Click it and Unblock the Notifications