ఎంపీ టిక్కెట్ కోసం రంగంలోకి దిగిన టీటీడీ బోర్డు మెంబర్ కొడుకు, తండ్రి రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ వారసులు తెరమీదకు వస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల కుమారులు, కుమార్తెలు మాకు ఎంపీ టిక్కెట్లు ఇవ్వండి అంటూ పలు పార్టీలకు మనవి చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తనకు టిక్కెట్ ఇచ్చి కర్ణాటకలోని చిక్కబళ్లాపూరం లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అనుమతిస్తే నేను కచ్చితంగా గెలుస్తానని బెంగళూరులోని యలహంక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ధీమా వ్యక్తం చేశారు.

అదేవిధంగా చిక్కబళ్లాపురం లోక్ సభ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్నడూలేని విధంగా చిక్కబళ్లాపురంను తీర్చిదిద్దుతానని బెంగళూరులోని యలహంక ఎమ్మెల్యే ఎస్.ఆర్. విశ్వనాథ్ కుమారుడు అలోక్ విశ్వనాథ్ అన్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆదిచుంచనగిరి మహాసంస్థానం మఠాధిపతి డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామీజీ సన్నిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోమం, పూజా కార్యక్రమాల్లో అలోక్ విశ్వనాథ్ పాల్గొన్నాడు.

BJP MLA Vishwanath Reddy s son Alok says he is contesting for Chikkaballapuram Lok Sabha ticket

ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించి శ్రీవారి ఆశీస్సులు పొందిన అనంతరం అలోక్ విశ్వనాథ్ విలేకరులతో మాట్లాడారు. చిక్కబళ్లాపురం లోక్ సభ నియోజకవర్గ అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌కు విన్నవించానని, మా అభ్యర్థనను మన్నించి నాకు టిక్కెట్ ఇచ్చి చిక్కబళ్లాపూరం లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి ఊహించని విజయం సాధించి పెట్టడానికి అవకాశం ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ కు మనవి చేశామని అలోక్ విశ్వనాథ్ అన్నారు.

చిక్కబళ్లాపురం లోక్ సభ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, మేము దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నామని, అందుకే బీజేపీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నానని అలోక్ విశ్వనాథ్ అన్నారు. అదే విధంగా పార్టీ సూచించిన పనులకు అనుగుణంగా నడుచుకుంటానని అలోక్ విశ్వనాథ్ తెలిపారు. శ్రీ ఆదిచుంచనగిరి మఠాధిపతి డాక్టర్ నిర్మలానంద స్వామీజీ సమక్షంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో అలోక్ విశ్వనాథ పాల్గొన్నారు.

BJP MLA Vishwanath Reddy s son Alok says he is contesting for Chikkaballapuram Lok Sabha ticket

చిక్కబళ్లాపరం లోక్ సభ నియోజక వర్గం టిక్కెట్ తనకు దక్కాలని పూజలు చేశారని తెలిసింది. బెంగళూరులోని యలహంకు బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్. విశ్వనాథ్ అలియాస్ విశ్వనాథ్ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు, రెండుసార్లు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండటానికి విశ్వనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ మోహ్మన్ రెడ్డి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+