దమ్ముంటే నాతో పెట్టుకోండి: బీజేపీకి సిన్హా సవాల్
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత శత్రుఘ్న సిన్హా మరో సారి సొంత పార్టీ నాయత్వంపై విరుచుకుపడ్డారు. తన మీద చర్య తీసుకునే దమ్ము ఎవ్వరికీ లేదని, ఉంటే ముందుకు రావాలని సవాలు విసిరారు.
తన మీద, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి, బీజేపీ ఎంపీ ఆర్ కే సింగ్ పై చర్యలు తీసుకునే అధికారం బీజేపీలో ఎవ్వరికి లేదని, అంత దమ్ము ఎవ్వరికి లేదంటూ శత్రుఘ్న సిన్హా మండిపడ్డారు. బీహార్ ఎన్నికలలో ఓటమికి భాద్యులైన వారు అందుకు కారణాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓటమికి సమిష్టి బాధ్యత వహించాలని అగ్రనేతల నిర్ణయాన్ని ఆయన ఖండించారు. మీరు తప్పు చేసి అందరికి అంటకడితే ఏలా అని ప్రశ్నించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్స్ కు టిక్కెట్లు ఇవ్వడం వలన ఓడిపోయామని ఆయన ఆరోపించారు.

బీహారి సింహం ఆర్ కే సింగ్ చేసినా వ్యాఖ్యలలో ఎలాంటి తప్పు లేదని వెనుకేసుకుని వచ్చారు. స్థానికేతరులతో ప్రచారం చేయించినందుకు బీహార్ లో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుందని శత్రుఘ్న సిన్హా గుర్తు చేశారు.
క్రిమినల్స్ కు టిక్కెట్లు ఇచ్చారని శుత్రుఘ్న సిన్హా బహిరంగంగా వ్యాఖ్యలు చెయ్యడంతో బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ లాల్ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హాకు సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సిన్హా ఈ విదంగా నాయకులపై మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications