వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి షాక్: శత్రుఘ్న సిన్హా ధిక్కారస్వరం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అదే పార్టీకి చెందిన ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా మరో సారి షాక్ ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయాలపై సీబీఐ దాడులు చేయడానికి ఇది సరైన సమయం కాదన్నారు.

సీబీఐకి దాడులు చెయ్యాలని ఎవరు సలహా ఇచ్చారు అనే విషయం తెలియడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో సమయం చాల విలువైనదని అన్నారు. అయితే ఈ టైంలో దాడులు చెయ్యడం సరికాదు అంటూ శత్రుఘ్న సిన్హా ధిక్కారస్వరం వినిపించారు.

BJP MP Shatrughan Sinha raises questions overr CBI raid at Kejriwal’s office

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పాపులారిటీనే కాదు మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కవగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ఇలాంటి సమయంలో సీబీఐ దాడులు చెయ్యడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే ప్రధాని నరేంద్ర మోడీ మీద అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను శత్రఘ్న సిన్హా ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీ పిరికిపంద, ఓ సైకో అంటూ అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించిన బాషను శత్రుఘ్నసిన్హా తప్పుబట్టారు. ఓ ముఖ్యమంత్రి ప్రధాని మోడీని ఆలా మాట్లాడరాదని సూచించారు.

English summary
Questions were raised by BJP MP Shatrughan Sinha today over the timing of the CBI raid at the office of Delhi Chief Minister Arvind Kejriwal's principal secretary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X