తృణమూల్ లోకి సుబ్రమణ్యస్వామి ? మమతతో భేటీ-ఆమెతోనే ఉన్నానంటూ వ్యాఖ్య
తన సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఇవాళ మరో సంచలనానికి తెరదీశారు. బీజేపీకి బద్ద విరోధి అయిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. అంతే కాదు మరిన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో చేరుతున్నారన్న ప్రచారం సాగుతోంది.
నిన్న పశ్చిమబెంగాల్లో గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ తో భేటీ అయిన సుబ్రమణ్యస్వామి.. ఇవాళ ఢిల్లీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇంట్లో ఈ భేటీ జరిగింది. ప్రధాని మోడీతో భేటీ కోసం మమతా బెనర్జీ తన పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీ వచ్చారు. ఈ సమయంలోనే సుబ్రమణ్యస్వామి వచ్చి ఆమెను కలవడం కలకలం రేపింది.

మమతా బెనర్జీతో భేటీపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సుబ్రమణ్యస్వామి స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ లో చేరుతున్నారా అని ప్రశ్నించగా... తాను ఇప్పటికే మమతా బెనర్జీతోనే ఉన్నానని వ్యాఖ్యానించారు. కొత్తగా తృణమూల్ లో చేరాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీంతో ఆయన టీఎంసీలో చేరబోతున్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది. గత నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి సుబ్రమణ్యస్వామిని తప్పించారు. ఆ తర్వాత పలుమార్లు బీజేపీకి రాజకీయశత్రువైన మమతను ప్రశంసిస్తూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన టీఎంసీలో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
Subramanian Swamy with West Bengal CM Mamata Banerjee after their meeting in Delhi. @IndianExpress pic.twitter.com/1tKDDEbIQl
— Sourav Roy Barman (@Sourav_RB) November 24, 2021
Recommended Video
మరోవైపు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇవాళ సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ అయి బీఎస్ఎఫ్ పరిధి పెంపు, త్రిపురలో టీఎంసీ కార్యకర్తలపై దాడులు వంటి పలు అంశాల్ని ప్రస్తావించబోతున్నారు. ఆ లోపే సుబ్రమణ్యస్వామితో భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది.
-
హార్దిక్ అవుట్ తో కృనాల్ వైల్డ్ సెలబ్రేషన్స్- ఆ వివాదమే అసలు కారణమా..!? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications