
ఆర్థిక నేరగాళ్ల సంగతి తేల్చండి ! .. యూపీలో ఎన్నికల వేళ.. ప్రధాని మోదీకి వరుణ్ గాంధీ సవాల్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ బీజేపీ ఎంపీ వరణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఆర్థిక నేరగాళ్ల సంగతి తేల్చాలని ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఆర్థిక నేరాలకు పాల్పడున్నవారిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు. బీజేపీ ఎంపీయే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. కమలం పార్టీకి యూపీ ఎన్నికల వేళ తీవ్ర తలనొప్పిగా మారింది.

అవినీతిపరులకు సకల సౌకర్యాలు
దేశంలో అవినీతిపరులు సకల సౌభాగ్యాలు అనువిస్తున్నారని ఎంపీ వరుణ్ గాందీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రుణగ్రస్థ భారతదేశంలో రోజుకు ఎంతో మంది అప్పులతో రైతులు, చేనేత కార్మికులు, పేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎంతో మంది పేదలు ఇళ్లు లేక రోడ్లపైనే జీవనాన్ని గడుపుతున్నారన్నారు. పేదల జీవితాల్లో వెలుగు నింపాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న సామాన్యులకు ఒక న్యాయం .. ఆర్థిక నేరస్తులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు.
ఆర్థిక నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోండి..
దేశంలో
ప్రధానమైన
బ్యాంకుల
నుంచి
రుణాలు
తీసుకుని
పరారైన
వ్యాపారవేత్తలు
నీరవ్
మోదీ
రూ.14,000
కోట్లు,
విజయ్
మాల్యా
రూ.9,000
కోట్లు
మోసం
చేశారని
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
తాజాగా
మరో
కుంభకోణం
బయపడిందని
పేర్కొన్నారు.
ABG
షిప్‌యార్డు
కంపెనీ
మాజీ
చైర్మన్
రుషి
అగర్వాల్
భారీ
కుంభకోణంలో
ఇరుక్కున్నట్లు
వార్తలు
వస్తున్నాయని
వెల్లడించారు.
ఈ
కుంభకోణం
విలువ
దాదాపు
రూ.23,000
కోట్లకు
పైగా
ఉంటుందని
అంచనా
పేర్కొన్నారు.
ఈ
విషయాలను
ప్రస్తావిస్తూ..
తన
ట్విట్
లో
ఫోస్ట్
చేశారు
వరణ్
గాంధీ.
బలమైన
ప్రభుత్వం
ఇటువంటి
అవినీతిపై
కఠిన
చర్యలు
తీసుకోవాలని
ఆయన
కేంద్ర
ప్రభుత్వాన్ని
డిమాండ్
చేశారు.

బీజేపీకి తలనొప్పిగా వరుణ్ గాంధీ వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ వరుణ్ గాంధీ వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలో పడేశాయి. ఇటీవల మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు సక్రమంగా లేదని ఆరోపించారు. ఆందోళన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తాజా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.