వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మసీదులు అక్రమ నిర్మాణమే.. రాజ్యపాల్‌కు ఎంపీ లేఖ.. ఎక్కడో తెలుసా..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మ మరోసారి సంచలనం సృష్టించారు. తన నియోజకవర్గంలో 54 మసీదుల అక్రమ నిర్మాణమేనని బాంబు పేల్చారు. వీటి నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని లెప్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు లేఖ కూడా రాశారు. వర్మ లేఖతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. అంతేకాదు తాను వ్యక్తిగతంగా పరిశీలించి, నివేదిస్తున్నానని ఆ లేఖలో వర్మ పేర్కొన్నారు.

అక్రమ నిర్మాణాలే

అక్రమ నిర్మాణాలే

పశ్చిమ ఢిల్లీలో పరిశీలించి .. లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు ఎంపీ వర్మ. మసీదులతోపాటు, శ్మశానాల కోసం కేటాయించిన భూమి కూడా అక్రమమేని పేర్కొన్నారు. ఢిల్లీ అర్బన్ షెల్టర్ డెవలప్‌మెంట్ బోర్డు, గ్రామ్ సభ భూమి, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి చెందిన భూములు అక్రమంగా వినియోగించుకుంటున్నారని గుర్తుచేశారు. ఆయా స్థలాల్లో కమ్యూనిటీ కేంద్రాలు, పార్కులు, చెత్త వేసే గార్జెజ్ కేంద్రాలు, లేదంటే టాయిలెట్లను నిర్మించాలని కోరారు. కానీ విచిత్రంగా మసీదులు, శ్మశానాల కోసం కేటాయించండం ఏంటని ప్రశ్నించారు.

ఇవీ వివరాలు

ఇవీ వివరాలు

నరేలా, సుల్తాన్ పురి, భావానా, మంగోల్‌పురి ప్రాంతాల్లో నిర్మాణాలకు సంబంధించి జాబితాను కూడా అందులో పొందుపరిచారు ఎంపీ వర్మ. అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్‌తో ఓ కమిటీ వేయాలని కోరారు. ఆయా విభాగాధిపతులకు సమర్పించే నివేదికల ఆధారంగా అక్రమమేంటో, సక్రమమెంటో తెలుస్తోందన్నారు. అంతేకాదు రెండునెలల్లోగా అక్రమ నిర్మాణాల జాబితాను తేల్చాలని విన్నవించారు. ఈ అంశానికి సంబంధించి ఇదివరకే మైనారిటీ కమిషన్ కూడా ఐదుగురు సభ్యులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే.

భేటీకీ నో

భేటీకీ నో

అయితే ఆ కమిటీతో సభ్యులతో ఎంపీ సమావేశం కాలేదు. వారికి సూచించిన జాబితాను కూడా వారితో పంచుకోలేదని కమిటీ సభ్యులు చెప్తున్నారు. దీంతో వారే స్వయంగా ఎంపీ వర్మకు లేఖ కూడా రాశారు. గత 10 రోజుల నుంచి సమాచారం అందిస్తోన్న తమతో మసీదు కమిటీ సభ్యులు కూడా సమావేశం కావడం లేదని కమిటీ చైర్మన్ ఒవైసీ సుల్తాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాంతంలో గత 200 ఏళ్ల నుంచి మసీదులు ఉన్నాయని పుర్వీకులు చెప్పారని అక్కడున్న వృద్ధులు చెప్తున్నారు. ఇది ఇదివరకు ముస్లింల ప్రాతినిధ్యం ఎక్కువున్న ప్రాంతమని, అందుకే మసీదులు ఎక్కువున్నాయని చెప్తున్నారు.

English summary
in a fresh letter to Delhi Lieutenant Governor Anil Baijal, BJP MP West Delhi Parvesh Varma has submitted a list of mosques which have been built illegally in his constituency. In his letter, the BJP MP cited 54 instances of illegal mosques in West Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X