ప్రజలు ఏమనుకుంటున్నారు: నరేంద్ర మోడీ (ఫోటోలు)
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతం కావడానికి బీజేపీ నాయకులు సర్వశక్తులా పని చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుండి 7.30 గంటల లోపు బహిరంగ సభ ముగించాలని నరేంద్ర మోడీ నాయకులకు సూచించారని తెలిసింది.
బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సినియర్ నాయకుడు ఎల్.కే. అద్వాని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ కర్ణాటక శాఖ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి బహిరంగ సభలో మాట్లాడుతారు. మిగిలిన నాయకులు ఎవ్వరికి బహిరంగ సభలో మాట్లాడే అవకాశం లేదని సమాచారం.
బీజేపీకి చెందిన ఎంపీలు 10 వేల మంది కార్యకర్తలను, శాసన సభ్యులు ఐదువేల మంది కార్యకర్తలను బహిరంగ సభకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు. కనీసం ఒక లక్ష మంది బహిరంగ సభకు హాజరవుతారని బీజేపీ నాయకులు అంచనా వేశారు. బెంగళూరు నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు బహిరంగ సభకు హాజరవుతారని బీజేపీ నాయకులు బావిస్తున్నారు.

వేదిక మీద ప్రముఖులు వీరే
బహిరంగ సభ వేదిక మీద మోడీ, అద్వాని, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జెట్లి, రవిశంకర్ ప్రసాద్, సుస్మా స్వరాజ్, అనంత్ కుమార్, డి.వి, సదానంద గౌడ, వెంకయ్య నాయుడు, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్, ఆనందీ బెన్ పటేల్, దేవేంద్ర, రఘువర్ దాస్, రామ్ మనోహర్ లాల్ తదితరులు ఉండనున్నారు.

50 మందికి అవకాశం
బహిరంగ సభ జరిగే నేషనల్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక మీద 50మంది ప్రముఖులు కూర్చోనున్నారు.

50 వేల కుర్చీలు
బహిరంగ సభ జరిగే మైదానంలో 50 వేల మంది కుర్చోవడానికి అవకాశం కల్పించారు. వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేశారు.

సమీకరణ
బెంగళూరు నగరంలోని బీజేపీ శాసన సభ్యులు, ఎంపీలతో పాటు చుట్టు పక్కల జిల్లాలలోని నాయకులకు కార్యకర్తలను సమీకరించే భాద్యత అప్పగించారు.

చుట్టు పక్కల జిల్లాల నుండి
బెంగళూరు, బెంగళూరు గ్రామీణ, కోలారు, చిక్కబళ్లాపుర, రామనగర, మండ్య, మైసూరు, హాసన్, తుమకూరు తదితర జిల్లాల నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

ఆర్ఎస్ఎస్ నాయకులతో చర్చ
శుక్రవారం ఉదయం అల్పాహారం చేసే సమయంలో బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రంలోని 15 మంది ఆర్ఎస్ఎస్ ప్రముఖులను హోటలకు పిలిపించుకున్న మోడీ వారితో మంతనాలు జరిపారు.

ప్రజలు ఏమనుకుంటున్నారు
కేంద్ర ప్రభుత్వ పని తీరు పైన ప్రజలు ఏమనుకుంటున్నారని మోడీ ఆర్ఎస్ఎస్ నాయకులను అడిగి తెలుసుకున్నారు.

మాజీలతో సమావేశం
శుక్రవారం ఉదయం మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులతో నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వారు ఎందుకు ఓడిపోయారు, పార్టీలో వారికి ఎలాంటి స్థానం కల్పించాలని చర్చించారు.

కర్ణాటకలో అధికారంలోకి రావాలి
కర్ణాటకలో మనం అధికారంలోకి రావాలని, అందుకు ఇప్పటి నుండే జాగ్రతలు తీసుకోవాలని మోడీ రాష్ట్ర బీజేపీ నాయకులకు సూచించారు.

ప్రధాని అయిన తర్వాత
దేశ ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోడీ బెంగళూరులో బహిరంగ సమావేశంలో ప్రసగించనున్నారు. కన్నడిగులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ సభకు హాజరవుతున్నారు.












Click it and Unblock the Notifications