బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నరేంద్ర మోడీ ఫ్లెక్సీలు పెట్టారని పోలీసులకు ఫిర్యాదు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో ఎక్కడ చూసినా బీజేపీ జెండాలు, నరేంద్ర మోడీ ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనం ఇస్తున్నాయి. బీబీఎంపీ పరిధిలోని ‘ఎ' జోన్ లో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఎర్పాటు చెయ్యరాదని చట్టపరంగా నియమాలు ఉన్నాయి. బీబీఎంపీ ‘ఎ' జోన్ లో ఫ్లెక్సీలు, బ్యానర్లు నిషేదించారు.

ఈ సందర్బంలో నాయకులు ఇష్టం వచ్చినట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ప్రముఖ న్యాయవాది ఉమాపతి హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. న్యాయవాది ఉమాపతి ఫిర్యాదు స్వీకరించి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

బెంగళూరులో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఎన్ని ఫ్లక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చెయ్యడానికి మీరు అనుతి ఇచ్చారు అని నివేదిక ఇవ్వాలని ఉప లోకాయుక్త న్యాయమూర్తి సుభాష్ అడి బీబీఎంపీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు.

ఉదయం 11 గంటలకు

ఉదయం 11 గంటలకు

ఉదయం 11 గంటల సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బెంగళూరులో జ్యోతి వెలిగించి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభించారు.

అమిత్ షా అధ్యక్షత

అమిత్ షా అధ్యక్షత

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇక్కడి లలిత్ అశోక్ హోటల్ లో సోంత పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు.

అమిత్ షా ప్రసంగం

అమిత్ షా ప్రసంగం

వివిద రాష్ట్రాల నుండి వచ్చిన నాయకులను ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడారు.

ఘనంగా స్వాగత ఏర్పాట్లు

ఘనంగా స్వాగత ఏర్పాట్లు

ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన బీజేపీ పార్టి నాయకులకు హిందూ సాంప్రదాయ ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు.

నరేంద్ర మోడీ స్పీచ్

నరేంద్ర మోడీ స్పీచ్

శుక్రవారం సాయంత్రం నేషనల్ కాలేజ్ మైదానంలో జరిగే బహింరగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.

సభలో ప్రజలకు సమాధానం

సభలో ప్రజలకు సమాధానం

బహిరంగ సభ జరిగే సమయంలో ప్రజలు, కార్యకర్తలు అడిగే పలు ప్రశ్నలకు నరేంద్ర మోడీ వేదిక మీద నుండి సమాదానం ఇస్తారని రాష్ట్ర బీజేపీ నాయకులు అంటున్నారు.

ఎవరైనా మాట్లడటానికి అవకాశం

ఎవరైనా మాట్లడటానికి అవకాశం

నరేంద్ర మోడీ సభలో మాట్లాడిన తరువాత ప్రజలు ప్రశ్నలు అడుగుతారని, వారికి అక్కడే సమాధానం ఇస్తారని, ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలని మోడీ అక్కడి నుండే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి తెలిపారు.

కట్టుదిట్టమైన భద్రత

కట్టుదిట్టమైన భద్రత

లలిత్ అశోక హోటల్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హోటల్ సిబ్బంది 24 గంటలు సీసీమెరాలలోని పుటేజ్ లను కంట్రోల్ రూం నుండి పరిశీలిస్తున్నారు

కాషాయమయం అయిన అశోక హోటల్

కాషాయమయం అయిన అశోక హోటల్

నిత్యం వీవీఐపీలతో కిటకిటలాడే స్టార్ హోటల్ లలిత్ అశోక్ ప్రాంగణం కాషాయమయం అయ్యింది.

సిద్దు అధికార నివాసం పక్కనే

సిద్దు అధికార నివాసం పక్కనే

కర్ణాటక సీఎం సిద్దరామయ్య అధికార నివాసం కృష్ణ పక్కనే అశోక హోటల్ ఉంది. ఈ ప్రాంతం మొత్తం బీజేపీ జెండాలు దర్శనం ఇస్తున్నాయి.

యడ్యూరప్ప సంతోషం

యడ్యూరప్ప సంతోషం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్. యడ్యూరప్ప లలిత్ అశోక్ హోటల్ లో ఉల్లాసంగా కనిపించారు.

సదానంద చిరునవ్వులు

సదానంద చిరునవ్వులు

నిత్యం చిరునవ్వుతో కనిపించే కేంద్ర మంత్రి సదానందగౌడ అశోక హోటల్ లో ఇతర రాష్ట్రల నుండి వచ్చిన నాయకులతో ఉల్లాసంగా గడిపారు.

చక్కటి సభావేదిక

చక్కటి సభావేదిక

అశోక హోటల్ లో బీజేపీ కార్యవర్గ సమావేశానికి చూడచక్కటి వేదిక ఏర్పాటు చేశారు.

తరలి వచ్చిన నాయకులు

తరలి వచ్చిన నాయకులు

ఇతర రాష్ట్రాల నుండి వందలాధి మంది బీజేపీ నాయకులు కార్యక్రమానికి వచ్చారు. వారికి కేటాయించిన సీట్లలో వారు కుర్చున్నారు.

అంతా ప్లెక్సీల మయం

అంతా ప్లెక్సీల మయం

బెంగళూరు నగరంలో ఎక్కడ చూసిన బీజేపీ ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి. నరేంద్ర మోడీ రాక ఆ పార్టీ నాయకులలో పండగ వచ్చినంత పని అయ్యింది.

అన్ని సదుపాయాలు

అన్ని సదుపాయాలు

బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు బస చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు.

English summary
BJP national executive meeting begins in Hotel Lalit Ashok, Bengaluru on Thursday, April 2, 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X