వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణ భారతదేశంపై చిన్నచూపు: అమిత్ షా క్లారిటీ, సిద్దూ ప్రభుత్వం, అన్నిమతాలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ హై కమాండ్ కు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎం అయ్యిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. సిద్దరామయ్యలాంటి అవినీతి ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేదని, ఎప్పుడు రాదని అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శించారు. మైసూరులో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన అమిత్ షా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోశారు.

రైతుల ఆత్మహత్యలు

రైతుల ఆత్మహత్యలు

సిద్దరామయ్య చేతకాని ప్రభుత్వం వలన కర్ణాటకలోని అనేక మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని ఆదుకోకుండా సిద్దరామయ్య ప్రభుత్వం ఏమీ జరగలేదు అనే రీతిలో మౌనంగా ఉందని అమిత్ షా మండిపడ్డారు.

ఐటీ హబ్ కు విద్యుత్ కట్

ఐటీ హబ్ కు విద్యుత్ కట్

కర్ణాటక రాజధాని బెంగళూరు ఐటీ హబ్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని అమిత్ షా అన్నారు. అయితే బెంగళూరులోని ఐటీ హబ్ కు విద్యుత్ సరఫరా చెయ్యడంలో సిద్దరామయ్య ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు.

బెంగళూరు నిర్లక్షం

బెంగళూరు నిర్లక్షం

బెంగళూరు నుంచి కర్ణాటకకు కావలసిన ఆదాయం రాబట్టడంలో సిద్దరామయ్య ప్రభుత్వం విఫలం అయ్యిందని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి జేడీఎస్ పార్టీ పోటీ కాదని, ఒక్క బీజేపీ మాత్రమే అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు.

కులాల ఓట్లు

కులాల ఓట్లు

బీజేపీకి తాము హిందువుల ఓట్లు మాత్రమే అడగడంలేదని, అన్ని మతాల ఓట్లు అడుగుతున్నామని, ఒక్కలిగులు మాతో ఉన్నారని, అందర్నీ కలుపుకుని తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని, తాను బీసీలకు వ్యతిరేకం కాదని అమిత్ షా వివరించారు.

ఉత్తర, దక్షిణ భారత దేశాలు

ఉత్తర, దక్షిణ భారత దేశాలు

భారతదేశం అంతా ఒక్కటిగా ఉందని అమిత్ షా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే వ్యత్యాసం చూపించడం లేదని, అందర్నీ కలుపుకుని వెలుతున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.

English summary
BJP national president Amit Shah addressed press conference in Mysuru on March 31, 2018. Amith Shah in Karnataka for his two days state tour for Karnataka assembly elections 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X