కర్ణాటకలో బీజేపీ సెంచరీ.. ఢిల్లీలో జోరందుకున్న వేడుకలు
కర్టాటక ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీని సొంతం చేసుకొనే దిశగా బీజేపీ దూసుకెళ్తున్నది. బీజేపీ 100కుపైగా సీట్లలో అధిక్యంలో కొనసాగుతుండటంతో న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో వేడుకలు జోరందుకున్నాయి. బీజేపీ కార్యకర్తలు మోదీ, అమితాషాలకు అనుకూలంగా నినాదాలు చేశారు.
దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే కర్ణాటక ఎన్నికలపై దేశవ్యాప్తంగా దృష్టిపడింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్టాటక ఎన్నికలు ఆసక్తిగా మారాయి.

కర్ణాటకలోని లింగాయత్ కుల ప్రభావం ఉండే ప్రాంతాల్లో బీజేపీ, వక్కలిగ ప్రభావిత ప్రదేశాల్లో జేడీఎస్ అధిక్యంలో ఉన్నది. ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు గెలువాల్సిన నేపథ్యంలో బీజేపీ 111 సీట్లలో ముందంజలో ఉంది.












Click it and Unblock the Notifications