కర్నాటకలో బీజేవీ భారీ వ్యూహం-పార్టీ నేతల కంటే పీఠాధిపతులే బెటర్-వారితోనే మోడీ,షా మంతనాలు.
ఈ ఏడాది కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం.. ఈ క్రమంలో రాష్ట్రంలో నేతల్ని సైతం నమ్మడం లేదు.
కర్నాటకలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఐదేళ్ల బీజేపీ పాలనకు ఇవి కచ్చితంగా రిఫరెండం కాబోతున్నాయి. అంతకు మించి వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు రిహార్సల్స్ కాబోతున్నాయి. అసలే దక్షిణాదిన అధికారంలో ఉన్న ఏకైన రాష్టం కూడా కావడంతో బీజేపీ హైకమాండ్ ఇప్పుడు రాష్ట్ర నేతల్ని కూడా పక్కనబెట్టి పీఠాధిపతులతో వ్యూహరచన చేస్తోంది.
తాజాగా బీజేపీ దిగ్గజనేత,మాజీ సీఎం యడియూరప్ప క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. మిగతా నేతలు కూడా హైకమాండ్ నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురుచూడటం మినహా సొంతగా వ్యూహాలు రచించే పరిస్ధితి లేదు. అంతా ఢిల్లీలో హైకమాండ్ చూసుకుంటోంది. అంతే కాదు రాష్ట్రంలో గతంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కీలకమైన పీఠాధిపతుల సాయంతో రాష్ట్ర రాజకీయాల్లో గెలుపు వ్యూహాల్ని రచిస్తోంది. వారిని ఢిల్లీకి రప్పించి మరీ చర్చలు జరుపుతోంది.

ఢిల్లీ కర్నాటక సంఘం అమృత్ మహోత్సవం రాష్ట్రంలో కాకుండా దేశ రాజధానిలో నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో వేదికపైకి కర్నాటకకు చెందిన ఐదుగురు ముఖ్యమైన పీఠాధిపతుల్ని ఆహ్వనించారు. ఇందులో ముగ్గురు అగ్ర లింగాయత్ పీఠాధిపతులు, ఒక అగ్ర వొక్కలిగ జ్ఞాని, ఒక అగ్ర బ్రాహ్మణ మఠం అధిపతి, ఓ జైన ఆధ్యాత్మిక నాయకుడు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక బీజేపీకి చెందిన లింగాయత్ అగ్రనేతలు యడియూరప్ప, జగదీశ్ షెట్టర్, బసనగౌడ పాటిల్ యత్నాల్, మురుగేష్ నిరానీ గైర్హాజరయ్యారు. అలాగే డాక్టర్ సి ఎన్ అశ్వత్నారాయణ, ఆర్ అశోక, కె సుధాకర్ వంటి వొక్కలిగ నాయకులు ఉన్నారు. దీన్ని బట్టి బీజేపీ వ్యూహం అర్ధమవుతోంది.
ఢిల్లీ కార్యక్రమంలో వొక్కలిగ ధర్మకర్త నిర్మలానందనాధ స్వామి, లింగాయత్ పీఠాధిపతులు శివరాత్రి దేశికేంద్ర స్వామి, నంజావదూత స్వామి, శివమూర్తి శివాచార్య స్వామి, బ్రాహ్మణ పెజావర్ మఠం పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి, జైన ఆధ్యాత్మిక నేత డాక్టర్ వీరేంద్ర హెగ్గడే (రాజ్యసభ ఎంపీ) తదితరులు పాల్గొన్నారు. కర్నాటకలో సొంతంగా మత పెద్దలను పెంచి పోషించాలనే బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహంలో ఇది భాగంగా భావిస్తున్నారు. దీంతో బీజేపీ కొత్త గేమ్ ప్లాన్ ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీ సీనియర్లను నిమిత్తమాత్రులుగా మార్చేస్తోంది.












Click it and Unblock the Notifications