బీజేపీ నెక్ట్స్ టార్గెట్... ఈ ముఖ్యమంత్రేనా??
భారతీయ జనతాపార్టీ నెక్ట్స్ టార్గెట్ ఈ ముఖ్యమంత్రేనంటూ రాజకీయవర్గాల్లో జరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున పోటీపడుతున్న అభ్యర్థిని ద్రౌపది ముర్ముకే ఆ ముఖ్యమంత్రి మద్దతు ప్రకటించారు. విశేషమేమిటంటే ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ గిరిజన వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేశారు కాబట్టి.. తమ రాష్ట్రంలో గిరిజన జనాభా ఎక్కువ కాబట్టి ఆమెకు మద్దతు పలికారు. కానీ ఆయనపై అనూహ్యంగా 10 రోజుల క్రితం ఈడీ దాడులు జరిగాయి. ఆయన ఎవరో కాదు.. జార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.
మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను గమనించిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాల్లో కొత్తగా ఏక్‌నాథ్ షిండేలు పుట్టుకొస్తారంటూ ఎక్కడికక్కడ జోరుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. యూపీఏలో జేఎంఎం కీలక పార్టీగా ఉంది. ఆ పార్టీ కూడా తమకు మద్దతు ప్రకటిస్తే జార్కండ్ లో బీజేపీ-జేఎంఎం సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేయవచ్చన్న ఆలోచనలో ఉన్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

అయితే కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేస్తున్నప్పటికీ గిరిజన వర్గానికి చెందిన ముర్మును నిలబెట్టారు కాబట్టి మద్దతు పలికామని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే తమను బీజేపీకి సంబంధించినవారెవరూ ఇప్పటివరకు సంప్రదించలేదని జేఎంఎం వర్గాలు తెలిపాయి.

జార్కండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ఉత్సాహంగా ఉందని, రాష్ట్రపతి ఎన్నికలైన తర్వాత దీనిపై ఒక స్పష్టత వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న స్నేహాన్ని వదులుకొని బీజేపీతో చెలిమి చేయడానికి హేమంత్ అంగీకరిస్తారా? లేదా? అనేదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చను రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలో సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణపై దృష్టి సారించిన బీజేపీ అధికార టీఆర్ఎస్ తో హోరాహోరీగా తలపడుతోంది. ఎట్టిపరిస్థితుల్లోను ఆ రాష్ట్రంలో కమలం జెండాను రెపరెపలాడించలనే పట్టుదలతో ఉన్న పార్టీ అధిష్టానం ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది.












Click it and Unblock the Notifications