నుపూర్ కామెంట్ల దుమారం: బీజేపీ ఆఫీసుకు నిప్పు, టీఎంసీపై నేతల ఫైర్..
మహ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ చేసిన కామెంట్ల దుమారం కంటిన్యూ అవుతుంది. నుపూర్ సారీ చెప్పిన అతివాద సంస్థలు వినడం లేదు. బీజేపీ, హిందూ సంస్థల లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఒకడుగు ముందుకేసి బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
హౌరా రూరల్‌లో గల బీజేపీ కార్యాలయానికి కొందరు నిప్పుపెట్టారు. దానిని ఓ బీజేపీ నేత ట్వీట్ చేశారు. నిప్పు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆందోళనకారులు, రాళ్లు రువ్విన వారిపై బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బెంగాల్ ప్రభుత్వం ఎందుకు మిన్నకుండిపోయిందని అనిర్బాన్ గంగూలీ ప్రశ్నించారు.

తమ పార్టీ ఆఫీసు విధ్వంసం కావడానికి టీఎంసీ కారణం అని బీజేపీ నేత సువేంద్ అధికారి ఆరోపించారు. అల్లరిమూకలకు దీదీ సర్కార్ అండగా నిలుస్తోందని చెప్పారు. అందుకే వారు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు
హౌరాలో చెలరేగిన హింసాత్మక ఘటనలను పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళనకారులు రహదారి, రైలు మార్గాలను మూసివేశారు. చెంగల్ స్టేషన్ వద్ద ఆందోళనకారులు నిరసనకు దిగారు. దీంతో ఆగ్నేయ రైల్వే మార్గంలో రైళ్లను నిలిపివేశారు.












Click it and Unblock the Notifications