Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ కూటమి గెలవడానికి కారణం వెల్లడించిన చంద్రబాబు: ఎన్డీఏ భేటీలో..

BJP Parliamentary Party meeting: దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఇండియా కూటమి వరుస భేటీలను నిర్వహిస్తోన్నాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.ఈ పరిణామాల మధ్య ఎన్డీఏ.. ఢిల్లీలో సమావేశమైంది. బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు, కొత్తగా ఎన్నికైన లోక్‌సభ అభ్యర్థులు ఇందులో పాల్గొన్నారు. తమ పార్లమెంటరీ పార్టీ అధినేతగా ప్రధానమంత్రిని ఎన్నుకోనున్నారు. పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లోఈ సమావేశం కొద్దిసేపటి కిందటే మొదలైంది.

ఈ వేదికపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసీనులయ్యారు. జేడీఎస్- హెచ్ డీ కుమారస్వామి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- అజిత్ పవార్, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, జేడీయూ- నితీష్ కుమార్, శివసేన- ఏక్‌నాథ్ షిండే, లోక్‌ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్)- చిరాగ్ పాశ్వాన్, హిందుస్తానీ ఆవామీ మోర్చా- జీతన్ రామ్ మాంఝీ వేదికపై కూర్చున్నారు.

BJP Parliamentary Party meeting Chandrababu Naidi has praised PM Modi

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ అధినేతగా నరేంద్ర మోదీ పేరును ప్రతిపాదించారు. జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, హెచ్ డీ కుమారస్వామి, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్.. ఈ పేరును బలపరిచారు. ఆ వెంటనే ఇందులో పాల్గొన్న నాయకులందరూ బల్లలు చరుస్తూ, చప్పట్లు కొడుతూ మోదీకి అభినందనలు తెలిపారు.

అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ తరఫున ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌గా మోదీ పేరును ప్రతిపాదించారు. కొత్తగా ఎన్నికైన వారిని అభినందించారు. గత మూడు నెలలుగా మోదీ అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని వ్యాఖ్యానించారు. ఏ ఉత్సాహంతో మోదీ ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారో.. అదే ఉత్సాహంతో ఆయన దీన్ని ముగించారని పేర్కొన్నారు.

ప్రచారంలో భాగంగా ఏపీలో మూడు బహిరంగ సభలతో పాటు, ఓ భారీ ర్యాలీని నిర్వహించామని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్నికల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి గెలవడానికి ఇది కారణమైందని స్పష్టం చేశారు. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా.. వంటి నేతలు ఏపీలో కూటమి తరఫున ప్రచారం చేయడం కలిసి వచ్చిందని, ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్నిెపెంపొందించిందని అన్నారు.

నరేంద్ర మోదీని గొప్ప విజనరీగా అభివర్ణించారు చంద్రబాబు ఈ సందర్భగా. ఆయన ముందుచూపుతో వ్యవహరించారని, దూరదృష్టితో అనేక గొప్ప నిర్ణయాలను తీసుకున్నారని చెప్పారు. 10 సంవత్సరాల మోదీ నాయకత్వంలో దేశం అద్భుత ప్రగతిని సాధించిందని ప్రశంసించారు. దేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మార్చగలిగారని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+