Punjab assembly elections 2022 : బీజేపీ-పీఎల్సీ కూటమి మ్యానిఫెస్టో విడుదల

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి, విపక్ష ఆప్ తో పాటు బీజేపీ-పీఎల్సీ కూటమి కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్ధానంలో ఆప్ అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని సర్వేలు ఘోషిస్తున్నాయి. దీంతో ఆప్ ను అడ్డుకునేందుకు మిగతా పార్టీలు సన్నద్దమవుతున్నాయి.

కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ పెట్టుకున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ, శిరోమణి అకాలీదళ్ తో కలిసి తన పార్టీ పీఎల్సీని (పంజాబ్ లోక్ కాంగ్రెస్) నడిపిస్తున్న ఆయన.. ఇవాళ పంజాబ్ ఎన్నికల కోసం తమ కూటమి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. జలంధర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అమరీందర్ సింగ్ కూటమిలోని ఇతర నేతలతో కలిసి మ్యానిఫెస్టో విడుదల చేశారు. పంజాబ్ చాలా సున్నితమైన సరిహద్దు రాష్ట్రమని, రాష్ట్రానికి సుస్థిరమైన వ్యక్తులు అధికారంలో ఉండటం చాలా ముఖ్యమని ఈ కార్యక్రమంలో పాల్ిగొన్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.

BJP-PLC alliance releases manifesto for punjab assembly elections 2022

ఇందులో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అందరికీ 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. 300 యూనిట్లు దాటాక యూనిట్ కు రూ.3 చొప్పున వసూలు చేస్తారు. పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ ను యూనిట్ రూ.4 కే ఇస్తామని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తామని కూటమి తెలిపింది. ఐదు ఎకరాల వరకూ భూములున్న రైతులకు తీసుకున్న రుణాల్ని మాఫీ చేయాలని నిర్ణయించారు. ఎస్సీ, బీసీ, ఆర్ధికంగా బలహీన వర్గాల వారికి రూ.50 వేల వరకూ రుణాలు మాఫీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం కోటా రిజర్వేషన్ కల్పిస్తాని బీజేపీ కూటమి తెలిపింది. ఏడాదిలో కూలీలకు 150 పనిదినాలు కల్పించనున్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని బీజేపీ కూటమి మ్యానిఫెస్టోలో ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+