వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిట్లర్, స్టాలిన్ కన్నా దారుణం.. మోడీ సర్కార్‌పై మమతా చిందులు

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి శివాలెత్తారు. మోడీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఫైరయ్యారు. మోడీ ప్రభుత్వం.. అడాల్ప్ హిట్లర్, జొసెఫ్ స్టాలిన్, బెనిటొ ముస్సొలినీ కన్నా అద్వాన్నంగా ఉందని ఫైరయ్యారు. సోమవారం ఆమె కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం మనగలగాలి అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వయం ప్రతిపత్తి కలిగించాలని కోరారు.

BJP rule worse than that of Hitler, Stalin: Mamata Banerjee

ఏజెన్సీలతో పెత్తనం చెలాయించాలని కేంద్రం చూస్తోందని దీదీ ధ్వజమెత్తారు. దీంతో సమాఖ్య నిర్మాణాన్ని బుల్డొజ్ చేస్తోందని ఫైరయ్యారు. దీంతోపాటు పెట్రో ధరల తగ్గింపు అంశాన్ని కూడా మాట్లాడారు. ఇదీ ముమ్మాటికీ ఎన్నికల స్టంట్ అని మమతా బెనర్జీ కొట్టిపారేశారు. ఇదీ కేవలం బీపీఎల్ కుటుంబాలకు మాత్రమో ప్రయోజనం కలిగిస్తోందని చెప్పారు. బీపీఎల్‌లో కొద్దీ భాగం మాత్రమే ఉజ్వల యోజన కింద ఉది. పేదలు రూ.800 పెట్టి డొమెస్టిక్ గ్యాస్ ఎలా కొనుగోలు చేస్తారని అడిగారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని స్పష్టం చేశారు. దీంతో కలుగజేసుకునే అవకావం ఉండదు. వాటిలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేని రీతిలో చర్యలు తీసుకోలేరని, నిష్పాక్షికతకు పెద్దపీట వేయాలని మమతా బెనర్జీ సూచించారు.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee hit out at the BJP-led government at the Centre and accused it of interfering in state’s affairs using central agencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X