బీజేపీకి బిగ్ షాక్: హోరాహోరీగా పోటీ పడి ఓడిన మెట్రోమ్యాన్ శ్రీధరన్
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీ తరపున పాలక్కడ్ నుంచి పోటీ చేసిన మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్ ఓటమిపాలయ్యారు. అయితే, చివరి రౌండ్ వరకు విజయం దోబూచులాడింది. 17 రౌండ్లలో ఫలితాలు వెలువడగా పలు రౌండ్లలో శ్రీధరన్ ఆధిక్యత చాటారు.
అయితే, చివరి రౌండ్లలలో పిరయిరి, మథుర్, కన్నడి పంచాయతీల ఓటర్ల మద్దతుతో పాలక్కడ్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే షఫీ పరంబిల్ విజయం సాధించారు.

పాలక్కడ్ నుంచి పోటీ చేసిన శ్రీధరన్‌కు ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందనే లభించింది. అంతేగాక, తాను పాలక్కడ్ నుంచి విజయం సాధిస్తానని కూడా పలు ఇంటర్వ్యూలలో ఆయన చెప్పారు. ఎమ్మెల్యే అయిన తర్వాత తాను పాలక్కడ్‌కే వస్తానని, ఇక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటానని చెప్పారు.
అంతేగాక, నిజయోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా కల్పిస్తానని శ్రీధరన్ చెప్పారు. పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు. లవ్ జిహాద్ లాంటి వాటిని అడ్డుకుంటానని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరకు శ్రీధరన్ ఓటమిపాలయ్యారు.
పాలక్కడ్ నియోజకవర్గంలో ఎప్పుడూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు కంచుకోటలా ఉంటోంది. 2011 నుంచి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధిస్తున్నారు. పాలక్కడ్ మున్సిపాలిటీ బీజేపీ చేతిలోనే ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
పాలక్కడ్‌లో అగ్రవర్ణాల హిందువులు ఎక్కువగా ఉండటంతో శ్రీధరన్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. 2016లో తిరువనంతపురంలోని నెమమ్ సీటును మాత్రమే బీజేపీ గెలుచుకుంది. తాజా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆ ఒక్కసీటును కూడా కోల్పోయింది. ఎల్డీఎఫ్ అభ్యర్థి వీ శివం కుట్టి గెలుపొందారు.
2016లో పాలక్కడ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత శోభా సురేంద్రన్ పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థికి 29.08 శాతం ఓట్లు రాగా, సీపీఎంకు అభ్యర్థికి 28.07 శాతం ఓట్లు వచ్చాయి. 41.77 శాతం ఓట్లు సాధించిన యూడీఎఫ్ అభ్యర్థి షఫీ పరంబిల్ విజయం సాధించారు. కాగా, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్ భారీ విజయాన్ని నమోదు చేశారు. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని, రెండోసారి సీఎం పదవీ చేపట్టున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications