నితీష్ తర్వాత.. ఎన్డీయే కూటమిలోకి అన్నాడీఎంకే?
బీహార్‌లో నితీష్ కుమార్ తర్వాత, దక్షిణాదిన అన్నాడీఎంకే ఎన్డీయే ప్రభుత్వంలో చేరనుందా? అంటే ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
చెన్నై: బీహార్‌లో నితీష్ కుమార్ తర్వాత, దక్షిణాదిన అన్నాడీఎంకే ఎన్డీయే ప్రభుత్వంలో చేరనుందా? అంటే ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
సమాచారం మేరకు.. ఎన్డీయేతో పొత్తు విషయమై ఆగస్టు 4న అన్నాడీఎంకేలోని సీనియర్ నేతలు సమావేశమై ఏ విషయం అన్నది ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి పళనిస్వామి కేబినెట్‌కి చెందిన ఓ సీనియర్ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైతే ఏ విషయమన్నది కచ్చితంగా చెప్పలేమని, శుక్రవారం సమావేశమై నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
తమిళనాడులో ప్రస్తుతం 2.5 శాతం ఓట్లు కలిగిన బిజెపి, అన్నాడీఎంకేతో పొత్తుతో మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అన్నాడీఎంకేను కలపుకొని పోవడం ద్వారా బలపడాలని బిజెపి భావిస్తోంది.












Click it and Unblock the Notifications