బీజేపీ ఎన్నికల ప్రచార ఖర్చు రూ.714 కోట్లు...మోడీ 3డీకే రూ.61 కోట్లు
న్యూఢిల్లీ: 2014 లోక్‌సభ ఎన్నికల్లో రూ. 714 కోట్లు ఖర్చు చేసిందని ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో ప్రచారానికి భారతీయ జనతా పార్టీ పేర్కొంది. అందులో ప్రధాని నరేంద్రమోడీ 3డీ ఎన్నికల ప్రచారానికే రూ. 61 కోట్లు ఖర్చు చేశారు.
ఇక పత్రికలు, ఎలక్ట్రానికి మీడియాల్లో ప్రకటనలు, సంక్షిప్త సందేశాలు మొదలైన వాటి కోసం రూ. 304 కోట్లు వెచ్చించారు. 2012లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో టెక్నాలజీని ఉపయోగించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

పార్టీ లీడర్లైన ఎల్‌కే అద్వానీ, వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, అరుణ్ జైట్లీ లాంటి వారి ప్రయాణ ఖర్చుల కోసం రూ. 78 కోట్లు ఖర్చు చేసారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 75 రోజులు, లోక్‌సభ ఎన్నికలు జరిగిన 90 రోజుల తర్వాత ఆయా పార్టీలు ప్రచార ఖర్చులు ఎన్నికల కమిషన్‌కు నివేదకలో సమర్పించాల్సి ఉండటంతో బీజేపీ తన నివేదకను సమర్పించింది.












Click it and Unblock the Notifications